iDreamPost
android-app
ios-app

ESICలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,139 జీతం.. అర్హతలు ఏంటంటే?

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ వేతనంతో ఈఎస్ఐసీలో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష రాయకుండానే జాబ్ పొందొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ వేతనంతో ఈఎస్ఐసీలో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష రాయకుండానే జాబ్ పొందొచ్చు.

ESICలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,139 జీతం.. అర్హతలు ఏంటంటే?

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే రాత పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరీక్షల్లో ప్రతిభకనబర్చాలి, ఇంటర్య్వూలో కూడా రాణించాలి అప్పుడే గవర్నమెంట్ జాబ్ మీ సొంతం అవుతుంది. అయితే కొన్ని జాబ్స్ మాత్రం ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. రాత పరీక్ష రాయకుండానే ఈఎస్ఐసీలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలను పొందితే లైఫ్ సెట్ అయిపోతది. ఈ జాబ్స్ కు ఎంపికైన వారికి నెలకు రూ. 1,40,139 జీతం అందిస్తారు. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికులకు ఆయా సంస్థలు ఈఎస్ఐసీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఈఎస్ఐసీలో మెరుగైన సేలను అందించేందుకు అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిచుకుంటుంది సంస్థ. ఇటీవల పూణె బిబ్వేవాడిలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్(ఈఎస్ఐసీ) సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా తత్సమానం/ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల సంఖ్య:

  • 07

విభాగాల వారీగా ఖాళీలు:

  • జనరల్‌ సర్జరీ: 01
  • ఆఫ్తాల్మాలజీ: 01
  • జనరల్ మెడిసిన్‌: 01
  • పాథాలజీ: 01
  • అనస్థీషియా: 01
  • ఈఎన్‌టీ: 01
  • ఆర్థోపెడిక్స్‌: 01

అర్హత:

  • అభ్యర్థులు ఎంబీబీఎస్‌ పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా తత్సమానం/ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 15.05.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం:

  • పోస్టులను అనుసరించి నెలకు రూ.67700 నుంచి రూ.1,40,139 అందిస్తారు.

ఎంపిక విధానం:

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ:

  • 15-05-2024

ఇంటర్వ్యూ వేదిక:

  • ఈఎస్ఐసీ హాస్పిటల్, Hospital, పూణె బిబ్వేవాడి, సర్వే నెం. 690, బిబ్వేవాడి, పూణె – 411 037.