Dharani
Festival Season-Temporary Jobs: పండుగల వేళ నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. లక్షల్లో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుుతన్నాయి. ఆ వివరాలు..
Festival Season-Temporary Jobs: పండుగల వేళ నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. లక్షల్లో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుుతన్నాయి. ఆ వివరాలు..
Dharani
శ్రావణమాసం అంటేనే పండుగల సీజన్. ఈ మాసం నుంచి వరుసగా పండగలు క్యూ కడతాయి. ఇక ఈ నెలలో రాకీ పండుగ, వరలక్ష్మి వ్రతం, క్రిష్ణాష్టమి, ఆ తర్వత వినాయక చవితి.. ఆపై దసరా ఇలా వరుసగా పండగలు క్యూ కడతాయి. ఇక వరుస పర్వదినాలను పురస్కరించుకుని.. అనేక కంపెనీలు నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యాయి. ఈ పండుగల వేళ లక్షల్లో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతున్నాయి. కానీ ఇక్కడో మెలిక ఉంది. ఇంతకు అది ఏంటి.. లక్షల మందిని ఏ రంగాల్లో నియమించుకుంటారు వంటి వివరాలు.. మీకోసం..
రాబోయే పండుగల సీజన్ కోసం కొలువుల సైరన్ మోగింది. అయితే అవి పర్మినెంట్ కొలువులు కాదు.. తాత్కలిక ఉద్యోగాలు అన్నమాట. పండుగల వేళ కస్టమర్ల డిమాండ్లను నెరవేర్చడం కోసం ఈ ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు(తాత్కాలిక ఉద్యోగులు) ఉద్యోగావకాశాలు లభించనున్నాయని నివేదిలు తెలిపాయి. గతేడాది పండుగ సీజన్ తో పోలిస్తే.. ఈ ఏడాది గిగ్ జాబ్స్ 15-20 శాతం పెరిగడం గమనార్హం. వినియోగాదారులు ఈ సారి పండుగల వేళ భారీ ఎత్తున కొనుగోళ్లు చేస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ క్రమంలోనే కంపెనీలు, కీలక పరిశ్రమలు పండగల అమ్మకాల కోసం తాత్కలిక కొలవులతో రెడీ అవుతున్నాయని క్వెస్, ర్యాండ్ స్టాడ్, అడెకో, హెచ్ఆర్ సర్వీసెస్, టీమ్ లీజ్ సర్వీసెస్ వంటి నియమాకాల సంస్థలు చెబుతున్నాయి.
ఈ నెల అనగా ఆగస్టు 19 రాబోయే రాఖీ పౌర్ణమితో మొదలయ్యే పండుగ సీజన్.. కేరళ ఓనమ్, వినాయక చవితి, దసరా, దీపావళి, చివర్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తుంది. దీంతో ఈకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తాయి. కొనుగోళ్లు భారీగా ఉండనున్నాయనే అంచనాలతో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు తాత్కాలిక హైరింగ్ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ రెండు రంగాల గిగ్ నియామకాల వృద్ధి 30–35 శాతం ఉంటుందని భావిస్తున్నారు.
ఎన్నికలు, బడ్జెట్ వంటివి ఆలస్యం కావడంతో జనాలు చాలా వరకు కొనగోళ్లను వాయిదా వేశారు. వారంతా ఇప్పుడు పండుగ సీజన్ లో కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని రంగాల్లోనూ కలిపి 6 7 లక్షల మేర తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నారు. మరోపక్క, బ్యాంకులు,ఎన్‌బీఎఫ్‌సీలు సైతం లోన్లు, క్రెడిట్ కార్డుల జారీపై మరింత దృష్టి సారిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో తాత్కాలిక ఉద్యోగులను పెంచుకోవడం ద్వారా వాపారాన్ని మరింత పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి.
దాంతో పికపర్లు, ప్యాకర్లు, వేర్‌హౌసింగ్ స్టాక్ నిర్వహణ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, షాప్‌లలో, ఫీల్డ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించే సేల్స్ పర్సన్లను నియమించుకునేందుకు రెడీ అవుతున్నాయి కంపెనీలు. అలానే పండగల వేళ.. డెలివరీ సిబ్బంది, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్ ఫుల్‌ఫిల్మెంట్ సిబ్బంది నియామకాలు జోరందుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి.