iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలో 35 వేల పోస్టుల భర్తీ

CM Revanth reddy: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. త్వరలో 35 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

CM Revanth reddy: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. త్వరలో 35 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

నిరుద్యోగులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలో 35 వేల పోస్టుల భర్తీ

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగనున్నది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురును అందించారు. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాలీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల డేట్ లను పరీక్షల తేదీలను వెల్లడించారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో త్వరలోనే 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే 30 వేల జాబ్స్ ఇచ్చామని.. త్వరలోనే మరో 35 వేల పోస్టులను భర్తీ చేస్తామని.. సరైన సమయంలో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇక గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 7, 8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేసి ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని నిరసనలు తెలపడంతో డిసెంబర్ కు వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. నైపుణ్యాలు లేకపోవడంతోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తామని.. యంగ్‌ ఇండియా వర్సిటీలో ఏటా 20 వేల మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సిద్ధం చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.