iDreamPost
android-app
ios-app

క్యాబినెట్ సెక్రటేరియట్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేల జీతం

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. క్యాబినెట్ సెక్రటేరియట్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. క్యాబినెట్ సెక్రటేరియట్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

క్యాబినెట్ సెక్రటేరియట్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేల జీతం

ఉద్యోగం ప్రతి ఒక్కరి కల. ఉన్నతంగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించాలని కలలుకంటుంటారు. ఆ దిశగానే తమ ప్రయాణాన్ని సాగించి సన్నద్ధమవుతుంటారు. ఎన్ని ఆంటకాలు ఎదురైన అంకిత భావంతో చదువుకుని లక్ష్యాన్ని చేధిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు యువత. అయితే కొందరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం సాధించి స్థిరపడిపోతే, మరికొందరు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం కల్పించింది క్యాబినెట్ సెక్రటేరియట్.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీకు గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇదొక సువర్ణావకాశం. క్యాబినెట్ సెక్రటేరియట్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 125 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్స్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్ 6, 2023 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

అర్హత

క్యాబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి BE/ B.Tech, M.Sc పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి

క్యాబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు నవంబర్ 6, 2023 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.

జీతం

నెలకు రూ. 90,000

ఎంపిక ప్రక్రియ

నమోదు ధృవీకరణ

వైద్య పరీక్ష

గేట్ స్కోరు

వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో పాటు క్రింది చిరునామాకు పంపాలి.

పోస్ట్ బ్యాగ్ నం. 001

లోధి రోడ్ హెడ్ పోస్టాఫీసు

న్యూఢిల్లీ-110003

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: 07/10/2023

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: నవంబర్ 6, 2023