Arjun Suravaram
ఇంటర్ లో ఎక్కువ మంది తీసుకునేది ఎంపీసీ గ్రూప్... ఆ తరువాత ఎక్కువ మంది ప్రాధానత్య ఇచ్చేది బైపీసీకి. ఈ గ్రూప్ లో తీసుకుంటే అనేక రకలా ఉపయోగాలు ఉన్నాయని విద్యా నిపుణలు చెపుతున్నారు
ఇంటర్ లో ఎక్కువ మంది తీసుకునేది ఎంపీసీ గ్రూప్... ఆ తరువాత ఎక్కువ మంది ప్రాధానత్య ఇచ్చేది బైపీసీకి. ఈ గ్రూప్ లో తీసుకుంటే అనేక రకలా ఉపయోగాలు ఉన్నాయని విద్యా నిపుణలు చెపుతున్నారు
Arjun Suravaram
ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది కీలకమైనది. అందులోనూ పదో తరగతి తరువాత ఇంటర్ అనేది ఎంతో ముఖ్యమైనది. జీవితం కీలకమైన మలుపు ఇక్కడి నుంచి ఉంటాది. ఇక్కడ తీసుకునే నిర్ణయంపైనే మన భవిష్యత్తు ఉంటాది. అందుకే ఇంటర్ లో చాలా మంది ఎంతో ఆలోచించి గ్రూప్ లను ఎంచుకుంటారు. ఇక ఇంటర్ లో ఎక్కువ మంది తీసుకునేది ఎంపీసీ గ్రూప్… ఆ తరువాత ఎక్కువ మంది ప్రాధానత్య ఇచ్చేది బైపీసీకి. ఈ గ్రూప్ లో తీసుకుంటే అనేక రకలా ఉపయోగాలు ఉన్నాయని విద్యా నిపుణలు చెపుతున్నారు. మరి..బైపీసీలో ఉండే క్రేజీ కోర్సులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇంటర్ లో బైపీసీ తీసుకున్న వారు.. అక్కడ ఉత్తీర్ణులు అయిన తరువా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-యూజీలో ర్యాంకు ఆధారంగా వైద్య విద్యా కోర్సులు అయిన ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో చేరవచ్చు. అలానే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే..ఈఏపీసెట్ లో ర్యాంకు సాధించి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయవచ్చు. ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీ చేసే అవకాశముంది.
ఇంటర్మీడియెట్ బైపీసీ తీసుకోవడం ద్వారా డిగ్రీలో సైన్స్ గ్రూప్ లైన బీజెడ్‌సీ వంటి గ్రూప్ లో అడుగు పెట్టొచ్చు. నేటికాలంలో బీజెడ్‌సీలోనూ అనే సబ్జెట్ లు అందుబాటులోకి వచ్చాయి. బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్, హ్యూమన్ జెనెటిక్స్, జెనెటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తే…. ఫార్మా, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి. బైపీసీ గ్రూప్‌ను ఎంచుకునే విద్యార్థులకు ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ పై సహజ ఆసక్తి ఉండాలి.
ఇంటర్మీడియోట్ లో బైపీసీ తీసుకునే వారిలో ఎక్కువ మంది లక్ష్యం ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ గా ఉంటుంది. ఇందుకోసం ఇంటర్‌లో చేరిన తొలి రోజు నుంచే ‘నీట్-యూజీ’లో ర్యాంకు కోసం ఎంతో కృషి చేస్తుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. బైపీసీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్‌కు దీటైన కోర్సులెన్నో ఉన్నాయి. ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌తోపాటు బ్యాచిలర్స్, పీజీ స్థాయిలో వినూత్న కోర్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో మెడిసిన్ వంటి మరెన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌తోపాటు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనే కోర్సు ఉంటుంది. ఎంబీబీఎస్ తరువాత ఆదరుణ పొందిన కోర్సు ఇదేని విద్యానిపుణులు చెబుతున్నారు.
అలానే బైపీసీ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ( బీఏఎంఎస్) కూడా చేయవచ్చు. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్ అనే కోర్సు కూడా అందుబాటులో ఉంది. దీని తరువాత వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు..బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్(బీఎన్‌వైఎస్). ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. వీటితో పాటు బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు, అగ్రికల్చర్ బీఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీటెక్-ఫుడ్ టెక్నాలజీ, బీఎస్‌సీ(సీఏబీఎం) వంటి కోర్సులు బైపీసీ తో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక బైపీసీతో మరెన్నో క్రేజీ కోర్సులు , బెనిపిట్స్ ఉన్నాయి.