ఆర్మీలో చేరడం మీ కలా? భారీ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎప్పటినుంచంటే?

Indian Army Recruitment 2024: ఆర్మీలో చేరాలనుకునే వారికి సువర్ణావకాశం. ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం వచ్చింది. ఆ తేదీ నుంచి భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగనున్నది. ఎక్కడంటే?

Indian Army Recruitment 2024: ఆర్మీలో చేరాలనుకునే వారికి సువర్ణావకాశం. ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం వచ్చింది. ఆ తేదీ నుంచి భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగనున్నది. ఎక్కడంటే?

ఇండియన్ ఆర్మీలో చేరాలని యువత కలలుకంటుంటారు. చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే సైనికులకు ఎనలేని గౌరవం ఉంటుంది. సైనికులకు మంచి జీతంతో పాటు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దేశ సంపదను, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు సైనికులు. మరి మీరు కూడా ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా? ఆర్మీలో చేరేందుకు నిరంతరం శ్రమిస్తున్నారా? అయితే మీలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్. భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనున్నది. ఎప్పటి నుంచి.. ఎక్కడ జరుగనున్నదంటే?

ఆర్మీలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనున్నది. ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనున్నది. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అధికారులకు ఆదేశించారు. అక్కయ్యపాలెం పోర్ట్‌ ట్రస్ట్‌ డైమండ్‌ జూబ్లీ స్టేడియంలో ఆగ‌స్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుందని తెలిపారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 8వేల మంది యువత పాల్గొననున్నారని, ర్యాలీ సాఫీగా జరిగేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల రెసిడెన్సీ, నేటివీటి సర్టిఫికెట్లను పరిశీలించేందుకు ఉప తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని విశాఖ, భీమిలి ఆర్డీవోలను ఆదేశించారు. ఇండియన్ ఆర్మీలో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొని మీ కలను నిజం చేసుకోవచ్చు.

Show comments