iDreamPost
android-app
ios-app

ఏపీ సివిల్ సప్లైస్‌లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. రాష్ట్ర సివిల్ సప్లైయ్స్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. రాష్ట్ర సివిల్ సప్లైయ్స్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీ సివిల్ సప్లైస్‌లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల కాగా వాటి భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఏపీ పౌర సరపరాల కార్పోరేషన్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియను చేపట్టింది. సివిల్ సప్లైస్ లో పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. నెల్లూరు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న ఖాళీలను పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నెల్లూరు జిల్లాలో పోస్టులు

ఏపీ సివిల్‌ సప్లైయ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌.. నెల్లూరు జిల్లా కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో అకౌంటెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులున్నాయి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు :

  • అకౌంటెంట్ గ్రేడ్-III: 02
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 02

అర్హత:

  • డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు. రిజర్వుడ్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు.

జీతం:

  • నెలకు అకౌంటెంట్‌కు రూ.27,000. డీఈవోకు రూ.18,500 ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్‌, వేదాయపాలెం, నెల్లూరు చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 11-30-2023

అధికారిక వెబ్‌సైట్‌:

తూర్పుగోదావరి జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్- తూర్పుగోదావరి జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ముఖ్య సమాచారం:

పోస్టులు:

  • టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్‌- III:
  • 12 పోస్టులు

అర్హత:

  • బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్‌ / బయోటెక్నాలజీ/ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్/ బాటనీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

జీతం:

  • ఎంపికైన వారికి నెలకు 22 వేలు అందిస్తారు.

ఎంపిక విధానం:

  • అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్‌ సివిల్ సప్లైస్‌ మేనేజర్‌ ఆఫీస్‌, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • డిసెంబర్‌ 5, 2023.

అధికారిక వెబ్‌సైట్‌:

పార్వతీపురం జిల్లా కార్యాలయంలో పోస్టులు:

ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల కార్సొరేషన్‌ లిమిటెడ్‌, పార్వతీపురం జిల్లా కార్యాలయం లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకాలను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌: 9

అర్హత:

  • బీఎస్సీ (అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌ / బయోటెక్నాలజీ/ డ్రైల్యాండ్‌అగ్రికల్చర్‌/ బాటనీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి 40 ఏళ్ల వరకు వయసు సడలింపు ఉంటుంది.

జీతం:

  • నెలకు 22 వేలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • డిస్ట్రిక్ట్‌ సివిల్‌ సఫ్టైన్‌ మేనేజర్‌ ఆఫీస్‌, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం, సబ్‌ కలెక్టరేట్‌ కాంపౌండ్‌, పార్వతీపురం, మన్యం జిల్లా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 30-11-2023.

అధికారిక వెబ్ సైట్ :