iDreamPost
android-app
ios-app

ఆ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!

ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. ఆ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పోస్టులకు వీరు మాత్రమే అప్లై చేసుకునేందుకు అర్హులు.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. ఆ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పోస్టులకు వీరు మాత్రమే అప్లై చేసుకునేందుకు అర్హులు.

ఆ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంచి వేతనంతో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వెంటనే అప్లై చేసుకోండి. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భరోసా కేంద్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు జనవరి 23 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://womensafetywing.telangana.gov.in/district/nagarkurnool/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 04

రిసెప్షనిస్ట్ (టైర్-2) (ఫిమేల్): 01

అర్హత:

  • డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి. ఈఆర్‌పీ ట్యాలీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 09.01.2024 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.15,000 అందిస్తారు.

సపోర్ట్ పర్సన్ (ఫిమేల్): 02

అర్హత:

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (సోషల్ వర్క్/చైల్డ్ డెవలప్‌మెంట్/సైకాలజీ) ఉత్తీర్ణులై ఉండలి.

వయోపరిమితి:

  • 09.01.2024 నాటికి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.20,000 అందిస్తారు.

లీగల్ సపోర్ట్ పర్సన్ (ఫిమేల్): 01

అర్హత:

  • ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా ఎల్‌ఎల్ఎం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 09.01.2024 నాటికి 25 -40 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.22,000 అందిస్తారు.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నాగర్ కర్నూల్ జిల్లా, ఎస్పీ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

  • అర్హతలు, వయోపరిమితి, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:

O/o: Superintendent of Police,
Nagarkarnool, Kollapur.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 09-01-2024.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది:

  • 23-01-2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి