iDreamPost
android-app
ios-app

BTech చేసి ఖాళీగా ఉన్నారా? TGPSCలో జాబ్స్ రెడీ.. నెలకు 1,58,380 జీతం

మీరు బీటెక్ పూర్తి చేశారా? అయితే మీకు గోల్డెన్ ఛాన్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,58,380 జీతం పొందొచ్చు.

మీరు బీటెక్ పూర్తి చేశారా? అయితే మీకు గోల్డెన్ ఛాన్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,58,380 జీతం పొందొచ్చు.

BTech చేసి ఖాళీగా ఉన్నారా? TGPSCలో జాబ్స్ రెడీ.. నెలకు 1,58,380 జీతం

బీటెక్ ఉత్తీర్ణులేన వారు చాలా మంది ఐటీ రంగంలో స్థిరపడేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. జీతాలు లక్షల్లో ఉండటంతో సాఫ్ట్ వేర్ జాబ్స్ కు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో ఐటీ జాబ్స్ గాల్లో దీపాలుగా మారాయి. మరోవైపు కొత్త రిక్రూట్ మెంట్స్ కూడా జరగడంలేదు. ఇలాంటి సమయంలో బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలను సాధిస్తే నెలకు లక్షకు పైగా జీతాలు అందుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యుగులకు గుడ్ న్యూస్ అందించింది. టీజీపీఎస్సీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కార్యాలయంలో డిప్యూటేషన్‌ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ విద్యార్హతతోపాటు సంబంధిత విభాగాల్లో కనీసం ఏడాది నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 20 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి నోటిఫికేషన్ లో వెల్లడించిన చిరునామాలో సమర్పించాలి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల సంఖ్య: 06.

విభాగాల వారీగా ఖాళీలు:

  • చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్: 01
  • చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 01
  • సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
  • జూనియర్‌ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
  • సీనియర్‌ ప్రోగ్రామర్‌:01
  • జూనియర్‌ అడ్మినిస్ట్రేటర్:01

అర్హత:

  • అభ్యర్థులు ఎంటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ రూ.1,06,990 – రూ.1,58, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ రూ.1,06,990 – రూ.1,58,380. 380, సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ రూ.45,960 – రూ.1,24,150, జూనియర్‌ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ రూ.43,490 – రూ.1,18,730, సీనియర్‌ ప్రోగ్రామర్‌ రూ.54,220 – రూ.1,33,630, జూనియర్‌ అడ్మినిస్ట్రేటర్ రూ.42,300 – రూ.1,15,270 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

  • అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి హైదరాబాద్, ప్రతిభా భవన్‌లోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో సమర్పించాలి.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:

  • O/o. Telangana State Public Service Commission (TGPSC)
    Prathibha Bhavan, Mukarram Jahi Road,
    Nampally, Hyderabad – 500001.

దరఖాస్తులకు చివరితేది:

  • 20-06-2024