iDreamPost
android-app
ios-app

సైనిక్ స్కూల్ కోరుకొండలో జాబ్స్.. నెలకు 52 వేల జీతం.. ఈ అర్హతలుంటే చాలు

Sainik School Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్నవారు ఈ జాబ్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి. సైనిక్ స్కూల్ కోరుకొండలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Sainik School Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్నవారు ఈ జాబ్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి. సైనిక్ స్కూల్ కోరుకొండలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

సైనిక్ స్కూల్ కోరుకొండలో జాబ్స్.. నెలకు 52 వేల జీతం.. ఈ అర్హతలుంటే చాలు

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. సైనిక్ స్కూల్ కోరుకొండలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మంచి జీతంతో కూడిన ఈ ఉద్యోగాలన సాధిస్తే లైఫ్ లో సెటిల్ అవ్వొచ్చు. సైనిక్ స్కూల్ కోరుకొండ వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కౌన్సిలర్, క్రాఫ్ట్& వర్క్ షాప్ ఇన్ స్ట్రక్టర్, గుర్రపు స్వారీ శిక్షకుడు, బ్యండ్ మాస్టర్, టీజీటీ మ్యాథమేటిక్స్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సైకాలజీ, డీపీఎడ్, బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

కౌన్సిలర్: 01

  • అర్హత: సైకాలజీలో పట్టభద్రులు / పోస్ట్ గ్రాడ్యుయేట్లు అర్హులు.
  • వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు
  • జీతం: రూ.52,533

పి.టి.ఐ – కమ్ మాట్రన్ (స్త్రీ): 01

  • అర్హత: శారీరక విద్యలో బ్యాచిలర్ డిగ్రీ లేదా డి.పి.ఎడ్.
  • వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు
  • జీతం: రూ.34,000

క్రాఫ్ట్ & వర్క్‌షాప్ ఇన్‌స్ట్రక్టర్: 01

  • అర్హత:
    మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానం.
    రెండు సంవత్సరాల ట్రేడ్ సర్టిఫికేట్.
    ఆంగ్ల మాధ్యమంలో బోధించే సామర్థ్యం.
  • వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు
  • జీతం: రూ.34,164

గుర్రపు స్వారీ శిక్షకుడు: 01

  • అర్హత:
    ఇంటర్మీడియట్.
    స్కూల్ / గుర్రపు స్వారీ క్లబ్‌లో గుర్రపు స్వారీ శిక్షకుడిగా అనుభవం.
  • వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు
  • జీతం: రూ.34,000

బ్యాండ్ మాస్టర్: 01

  • అర్హత:
    ఏఈసీ శిక్షణ కళాశాల మరియు కేంద్ర పచ్మహార్చిలో బ్యాండ్ మాస్టర్/బ్యాండ్ మేజర్/డ్రమ్ మేజర్‌గా పనిచేసే అర్హత లేదా
    నావిక్/ఎయిర్ ఫోర్స్‌కు సమానమైన కోర్సులు.
  • వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు
  • జీతం: రూ.34,000

టి.జి.టి మ్యాథమేటిక్స్: 01

  • అర్హత:
    గణితం ఒక సబ్జెక్టుగా కనీసం 50% మార్కులు మరియు మొత్తంలో 50% మార్కులు సాధించి పట్టభద్రులు.
    సంబంధిత సబ్జెక్టులో బి.ఎడ్.
    ఎన్ సీటీఈ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్-2లో ఉత్తీర్ణత.
  • వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు
  • జీతం: రూ.52,533

మెడికల్ ఆఫీసర్: 01

  • అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ.
  • వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు
  • జీతం: రూ.74,552

నర్సింగ్ సిస్టర్ (స్త్రీ): 01

  • అర్హత: సీనియర్ సెకండరీ పరీక్ష (క్లాస్ XII) లేదా దానికి సమానమైన గ్రేడ్ ‘A’తో ఉత్తీర్ణత. లేదా బీఎస్సీ (నర్సింగ్). హాస్పిటల్/క్లినిక్‌లో రెండు సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం.
  • వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు
  • జీతం: రూ.29,835

దరఖాస్తు ఫీజు:

  • అన్ రిజర్వ్డ్ రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • నిర్దేశించిన ఫార్మాట్‌లో పూర్తి చేసిన దరఖాస్తును అన్ని సంబంధిత పత్రాలతో “ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, PO: సైనిక్ స్కూల్ కోరుకొండ, జిల్లా: విజయనగరం (AP), పిన్-535214″కు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ:

  • 13-09-2024