iDreamPost
android-app
ios-app

వెస్ట్రన్ రైల్వేలో జాబ్స్.. వీరు మాత్రమే అర్హులు.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్

RRC WR Sports Quota Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వెస్ట్రన్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. త్వరలోనే ముగుస్తున్న గడువు.

RRC WR Sports Quota Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వెస్ట్రన్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. త్వరలోనే ముగుస్తున్న గడువు.

వెస్ట్రన్ రైల్వేలో జాబ్స్.. వీరు మాత్రమే అర్హులు.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్

ఇటీవల రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. అప్రెంటిస్ పోస్టులు, టెక్నీషియన్, లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ ఇలా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రైల్వే జాబ్స్ కు కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. మరి మీరు కూడా రైల్వే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్ ఉంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీ/ గ్రూప్ డీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న పురుష, మహిళా క్రీడాకారులు సెప్టెంబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు : 64

  • లెవెల్‌-4/5 పోస్టులు: 5
  • లెవెల్‌-2/3 పోస్టులు: 16
  • లెవెల్‌-1 పోస్టులు: 43

అర్హత:

  • లెవెల్‌-4/5 పోస్టులకు ఏదైనా డిగ్రీ.. లెవెల్‌-2/3 పోస్టులకు ఐటీఐ, 12వ తరగతి.. లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి.

క్రీడాంశాలు:

  • బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితర క్రీడల్లో విజయాలు సాధించి ఉండాలి.

వయోపరిమితి:

  • 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 16-08-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 14-09-2024