iDreamPost
android-app
ios-app

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ లో జాబ్స్.. భారీగా జీతాలు.. ఫ్యూచర్ సెట్ చేసుకునే ఛాన్స్

Punjab and Sind Bank Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్ అయిపోద్ది. వెంటనే అప్లై చేసుకోండి.

Punjab and Sind Bank Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్ అయిపోద్ది. వెంటనే అప్లై చేసుకోండి.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ లో జాబ్స్.. భారీగా జీతాలు.. ఫ్యూచర్ సెట్ చేసుకునే ఛాన్స్

బ్యాంక్ జాబ్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. మంచి జీతాలు, సెలవులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు ఉండడంతో బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏళ్లతరబడి సన్నద్ధమవుతుంటారు. అందుకే బ్యాంక్ కొలువులకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపికైతే భారీగా జీతం పొందొచ్చు. మరి ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఎలా ఎంపిక చేస్తారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న పీఎస్‌బీ శాఖల్లో లేటరల్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 213 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 25 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పోస్టుల సంఖ్య: 213
  • ఆఫీసర్ పోస్టులు : 56
  • మేనేజర్ పోస్టులు : 117
  • సీనియర్ మేనేజర్ పోస్టులు : 33
  • చీఫ్ మేనేజర్ పోస్టులు : 07

అర్హత:

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 25 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

జీతం:

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ఆఫీసర్‌ పోస్టులకు రూ.48,480- 85,920. మేనేజర్‌ పోస్టులకు రూ.64,820- 93,960. సీనియర్ మేనేజర్‌ పోస్టులకు రూ.85,920- 1,05,280.. చీఫ్ మేనేజర్‌ పోస్టులకు రూ.1,02,300- 1,20,940 జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ కేటగిరీకి రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:

  • 15-09-2024