10th పాసైతే చాలు.. మంచి జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రెడీ..

NFC Hyderabad Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

NFC Hyderabad Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఈ రోజుల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరైన జాబ్ దొరకడం లేదు. చదువుకు తగిన ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏదో ఓ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. చదివిన చదువుకు చేసే జాబ్ కు పొంతన లేకుండా పోయింది. అయితే కొంతమంది సరైన స్కిల్స్ లేక జాబ్ సాధించలేకపోతున్నారు. ఇక టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడెరుగు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు లేకుండా పోతున్నది. దీంతో తమ చదువుకు తగిన ఉద్యోగం లేదని నిరాశ చెందుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో లైఫ్ నెట్టుకొస్తున్నారు.

ఇలాంటి వారు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. కానీ, ఎక్కడా అవకాశం లభించక నిరాశ చెందుతుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. టెన్త్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే గోల్డెన్ ఛాన్స్ మీ కళ్ల ముందే ఉంది. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇంకా లక్ ఏంటంటే రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది.

ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, డీజిల్‌ మెకానిక్, కార్పెంటర్‌, ప్లంబర్‌, వెల్డర్, స్టెనోగ్రాఫర్ వంటి ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయసు అప్లికేషన్ ప్రక్రియ ముగిసే తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.

ఈ జాబ్స్ కు పదో తరగతి లేదా ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ ట్రేడులకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల 700 నుంచి రూ.8 వేల 50 రూపాయలు చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అధికారిక వెబ్ సైట్ www.nfc.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.

Show comments