iDreamPost
android-app
ios-app

భారీగా Bank జాబ్స్.. ఈ అర్హతలుంటే చాలు.. వెంటనే అప్లై చేసుకోండి

IBPS Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. 896 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

IBPS Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. 896 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

భారీగా Bank జాబ్స్.. ఈ అర్హతలుంటే చాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రైవేట్ జాబ్ ఎంతకాలం చేసినా కూడా సెక్యూరిటీ అనేది ఉండదు. ఎప్పుడు జాబ్ ఊడుతుందో కూడా తెలియదు. పైగా టెన్షన్ తో కూడి ఉంటుంది. అదే గవర్నమెంట్ జాబ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో విధులు, నెలలో మొదటి రోజే జీతం చేతికి అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు మొదట్లో జీతం తక్కువ ఉన్నప్పటికీ ఆతర్వాత మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. వివిధ సౌకర్యాలు కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. అందుకే యూత్ అంతా గవర్నమెంట్ జాబ్ కొట్టడం డ్రీమ్ గా పెట్టుకుంటారు. మరి మీకు కూడా ఇలాంటి డ్రీమ్ ఉంటే మీకు ఇదే గోల్డెన్ ఛాన్స్. ప్రభుత్వ బ్యాంకుల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 896 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్‌, మేనేజ్‌మెంట్, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 20-30 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 896

అర్హత:

  • పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్‌,మేనేజ్‌మెంట్, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అన్ని పోస్ట్‌లకు 01.08.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.175 (జీఎస్టీతో కలిపి), మిగతా వాటికి రూ.850 (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

దరఖాస్తు చివరి తేదీ:

  • 21-08-2024