P Venkatesh
GAIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు 60వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
GAIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు 60వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
P Venkatesh
డిగ్రీ, పీజీలు చేసి జాబ్ దొరక్క నానా ఇబ్బందులు పడే వారు వేలల్లో ఉన్నారు. జాబ్ లేక, ఉపాధి లభించక తీవ్ర నిరాశలో కూరుకు పోతున్నారు. బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే పెట్టుబడికి డబ్బు ఉండదు. చివరకు కొందరు ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. మరికొందరు చదువుకు సంబంధం లేని జాబ్ చేస్తూ ఇబ్బందులు పడుతుంటారు. చాలీ చాలనీ జీతాలతో లైఫ్ నెట్టుకొస్తుంటారు. ఇలాంటి కష్టాలు రావొద్దంటే ఓ లక్ష్యం ఏర్పర్చుకుని ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా సరే ప్రయత్నిస్తే జాబ్ కొట్టే చాన్స్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా సరే మీతోపాటు మీ కుటుంబ స్థితిగతులు ఇట్టే మారిపోతాయి.
అందుకే గవర్నమెంట్ జాబ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? జాబ్ కోసం వెతికి విసిగి పోయారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. మంచి జీతంతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను మీ సొంతం చేసుకోవచ్చు. తాజాగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో ఈ1, ఈ2 గ్రేడ్ కేడర్‌లో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 261 పోస్టులను భర్తీ చేయనుంది.
అభ్యర్థులు పోస్టులను అనుసరించి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సీనియర్ ఆఫీసర్ మెడికల్ సర్వీసెస్/ ఆఫీసర్ ల్యాబొరేటరీ పోస్టులకు 32 ఏళ్లు.. ఆఫీసర్ సెక్యూరిటీ పోస్టులకు 45 ఏళ్లు.. ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులకు 35 ఏళ్లు.. ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరి వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు గ్రూప్ డిస్కషన్, ఫిజికల్ ఫిటెనెస్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు సీనియర్ ఇంజినీర్/ సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.60 వేల- రూ.1 లక్ష 80 వేలు.. ఆఫీసర్ పోస్టులకు రూ.50 వేల- రూ.1 లక్ష 60 వేల వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కలిపించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం గెయిల్ అధికారిక వెబ్ సైట్ gailonline.com ను సందర్శించాల్సి ఉంటుంది.