iDreamPost
android-app
ios-app

ARCI Recruitment 2024:10th అర్హతతో .. నెలకు 51 వేల జీతంతో Govt Jobs

ARCI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు పోస్టులను అనుసరించి 51 వేల వరకు జీతం అందుకోవచ్చు.

ARCI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు పోస్టులను అనుసరించి 51 వేల వరకు జీతం అందుకోవచ్చు.

ARCI Recruitment 2024:10th అర్హతతో .. నెలకు 51 వేల జీతంతో Govt Jobs

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. జాబ్ సెర్చ్ లో ఉన్న వారు ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌడర్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఏ, టెక్నికల్ అసిస్టెంట్ ఏ, టెక్నీషియన్ ఏ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులను అనుసరించి టెన్త్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 28-30 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులను రాత పరీక్ష, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే అసిస్టెంట్ ఏ పోస్టులకు నెలకు 57960, టెక్నికల్ అసిస్టెంట్ ఏ పోస్టులకు 69120, టెక్నీషియన్ ఏ పోస్టులకు 51300 అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 26 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు 300 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 15

అర్హత:

  • పోస్టులను అనుసరించి టెన్త్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టును అనుసరించి 28-30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • అసిస్టెంట్ ఏ పోస్టులకు నెలకు 57960, టెక్నికల్ అసిస్టెంట్ ఏ పోస్టులకు 69120, టెక్నీషియన్ ఏ పోస్టులకు 51300 అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు 300 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 26-08-2024