iDreamPost
android-app
ios-app

AP RGUKTలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉండాలి!

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీ క్యాంపస్ లలో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అర్హతలుండాలి.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీ క్యాంపస్ లలో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అర్హతలుండాలి.

AP RGUKTలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఇది మంచి అవకాశం. మంచి వేతనంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీ క్యాంపస్ లలో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనున్నారు. నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్‌లలో తాత్కిళిక ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీచేయనున్నారు.

కాగా ఈ నియామకాలు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ జరిగే వరకు అమల్లో ఉండనున్నాయి. రెండు సంవత్సరాల పీయూసీ ప్రోగ్రామ్ లో బోధన కోసం లెక్చరర్లను, నాలుగు సంవత్సరాల బీటెక్ ప్రోగ్రాం కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జనవరి 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఆర్జీయూకేటీ అధికారిక వెబ్ సైట్ https://www.rgukt.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం టీచింగ్ పోస్టులు:

  • 194 పోస్టులు

ఖాళీల వివరాలు:

లెక్చరర్:

  • 61 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్:

  • 133 పోస్టులు

క్యాంపస్‌లవారీగా లెక్చరర్ పోస్టుల కేటాయింపు:

  • నూజివీడు (ఏలూరు జిల్లా) క్యాంపస్‌: 02
  • ఆర్కే వ్యాలీ (కడప జిల్లా) క్యాంపస్‌: 18
  • ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) క్యాంపస్‌: 14
  • ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్‌: 27

అర్హతలు:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్) ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.33,000 అందిస్తారు.

క్యాంపస్‌ల వారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు:

  • నూజివీడు (ఏలూరు జిల్లా) క్యాంపస్‌: 31
  • ఆర్కే వ్యాలీ (కడప జిల్లా) క్యాంపస్‌: 45
  • ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) క్యాంపస్‌: 28
  • ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్‌: 29

అర్హతలు:

  • అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌లోపాటు 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి. నెట్/సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.35,000.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ ‌లైన్

ఎంపిక ప్రక్రియ:

  • ఇంటర్వ్యూ, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 09-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 22-01-2024

ఆర్జీయూకేటీ అధికారిక వెబ్ సైట్: