iDreamPost
android-app
ios-app

BTech పాసయ్యారా?.. లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి.. నెలకు 1.8 లక్షల జీతం

SAIL MT Recruitment 2024: బీటెక్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1.8 లక్షల జీతం అందుకోవచ్చు.

SAIL MT Recruitment 2024: బీటెక్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1.8 లక్షల జీతం అందుకోవచ్చు.

BTech పాసయ్యారా?.. లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి.. నెలకు 1.8 లక్షల జీతం

బీటెక్ పూర్తి చేశాక ఐటీ సెక్టార్ లో స్థిరపడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లక్షల ప్యాకేజీలతో కూడిన ఉద్యోగాలను పొందాలని కలలుకంటుంటారు. అయితే ప్రస్తుతం ఐటీరంగంలో లేఆఫ్స్ భయం పట్టుకుంది. ఎప్పుడు సాప్ట్ వేర్ జాబ్ ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే బీటెక్ పాసైన వారికి ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా ప్రభుత్వ సంస్థల్లో కళ్లు చెదిరే శాలరీతో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కూడా బీటెక్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వెంటనే అప్లై చేసుకోండి.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీలో పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.60,000 – రూ.1.8 లక్షల జీతాన్ని అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల సంఖ్య: 249

విభాగాల వారీగా ఖాళీలు:

  • కెమికల్ ఇంజినీరింగ్: 10
  • సివిల్ ఇంజినీరింగ్: 21
  • కంప్యూటర్ ఇంజినీరింగ్: 09
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 61
  • ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 05
  • ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 11
  • మెకానికల్ ఇంజినీరింగ్: 69
  • మెటలర్జికల్ ఇంజినీరింగ్: 63

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి:

  • 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక విధానం:

  • గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.60,000 – రూ.1,80,000 అందిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:

  • 05-07-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 25-07-2024