డిగ్రీ ఉంటే చాలు.. LICలో జాబ్ పొందే ఛాన్స్.. నెలకు 35 వేల జీతం

LIC Housing Finance Limited Recruitment 2024: ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

LIC Housing Finance Limited Recruitment 2024: ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇప్పుడు పాలసీలనే కాదు.. ఎల్ఐసీలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఎల్ఐసీలో కీలక విభాగమైన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు పోటీపడే వారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35 వేల జీతం అందుకోవచ్చు. వయోపరిమితి? ఇతర వివరాలు మీకోసం..

ఎల్ఐసీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో 12, తెలంగాణ నుంచి 31 పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 21-28 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల సంఖ్య: 200

ఏపీ: 12

తెలంగాణ: 31

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైన విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.32,000 నుంచి 35,200 మధ్య లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:

  • అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ:

  • 25-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 14-08-2024
Show comments