iDreamPost
android-app
ios-app

మీ లైఫ్ సెట్ అయ్యే ఛాన్స్.. 39,481 ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ జాబ్స్ రెడీ.. మంచి వేతనం

SSC GD Recruitment 2025: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. సాయుధ బలగాల్లో ఏకంగా 39,481 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

SSC GD Recruitment 2025: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. సాయుధ బలగాల్లో ఏకంగా 39,481 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

మీ లైఫ్ సెట్ అయ్యే ఛాన్స్.. 39,481 ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ జాబ్స్ రెడీ.. మంచి వేతనం

జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఇంకా ఎన్ని రోజులు నిరుద్యోగులుగా ఉంటారు. మీ లైఫ్ సెట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఈ జాబ్స్ ను మీ సొంతం చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మీరు కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగం పొందడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఈపోస్టులను అస్సలు వదలకండి. 39,481 ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

రక్షణ దళంలో పనిచేయాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపికబురును అందించింది. ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జీడీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతోనే మీరు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. నిర్థిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 14 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 39,481

అర్హత:

  • గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయోపరిమితి :

  • అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • సిపాయి ఉద్యోగాలకు రూ. 18000-56900 చెల్లిస్తారు. ఇతర పోస్టులకు రూ. 21700-69100 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100(మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 05-09-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 14-10-2024