iDreamPost
android-app
ios-app

మిమ్మల్ని రియల్ హీరోను చేసే జాబ్స్.. నెలకు 69 వేల జీతం.. డిగ్రీ కూడా అవసరం లేదు

ITBP Constable Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 69 వేల జీతంతో జాబ్స్ కొట్టే ఛాన్స్ వచ్చింది. డిగ్రీ కూడా అవసరం లేదు.

ITBP Constable Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 69 వేల జీతంతో జాబ్స్ కొట్టే ఛాన్స్ వచ్చింది. డిగ్రీ కూడా అవసరం లేదు.

మిమ్మల్ని రియల్ హీరోను చేసే జాబ్స్.. నెలకు 69 వేల జీతం.. డిగ్రీ కూడా అవసరం లేదు

లైఫ్ లో హీరో అవ్వాలంటే చేసే పనిపట్ల డెడికేషన్ ఉండాలి. లక్ష్యాన్ని చేధించేందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ముందుకు సాగిపోవాలి. నేటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంత తేలికైన పనేం కాదు. కాంపిటీషన్ విపరీతంగా ఉంది. మొక్కుబడిగా ప్రిపేర్ అవకుండా కసితో ప్రిపేర్ కావాలి. మీరు చేసే ప్రయత్నానికి విజయమే మీ వెనకాల పరుగెత్తాలి. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు లైఫ్ లో రియల్ హీరో అవ్వాలంటే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి.

భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 200 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీతో పనిలేకుండా జాబ్ కొట్టే ఛాన్స్. 18-23 ఏళ్లు వయసు కలిగి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 200

విభాగాల వారీగా ఖాళీలు ఇవే:

  • కానిస్టేబుల్ (కార్పెంటర్) (పురుషులు): 61
  • కానిస్టేబుల్ (కార్పెంటర్) (మహిళలు): 10
  • కానిస్టేబుల్ (ప్లంబర్) (పురుషులు): 44
  • కానిస్టేబుల్ (ప్లంబర్) (మహిళలు): 08
  • కానిస్టేబుల్ (మేసన్) (పురుషులు): 54
  • కానిస్టేబుల్ (మేసన్) (మహిళలు): 10
  • కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (పురుషులు): 14
  • కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (మహిళలు): 01

అర్హతలు:

  • మెట్రిక్యులేషన్​/ 10వ తరగతితో పాటు ఐటీఐ (మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయోపరిమితి:

  • 2024 సెప్టెంబర్​ 10 నాటికి అభ్యర్థుల వయస్సు 18- 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, రాత పరిక్ష, డాక్యూమెంట్ వెరిఫీకేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 – రూ.69,100 జీతం అందిస్తారు.

ఫీజు:

  • అన్​ రిజర్వ్​డ్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. మాజీ సైనిక ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరీ తేదీ:

  • 10-09-2024