iDreamPost
android-app
ios-app

ITI పాసైతే చాలు.. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

మీరు ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఇదే మంచి అవకాశం. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

మీరు ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఇదే మంచి అవకాశం. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ITI పాసైతే చాలు.. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళిక, డెడికేషన్ ఉండాలి. లక్ష్యాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఏళ్లకేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారు యువత. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. మీరు ఐటీఐ ఉత్తీర్ణులైతే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల పలు విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న వారు మే 20 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు నేరుగా ఇంటర్య్వూలకు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య:

  • 200

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఎలక్ట్రానిక్ మెకానిక్: 55
  • ఫిట్టర్: 35
  • ఎలక్ట్రిషియన్: 25
  • మెషినిస్ట్: 08
  • టర్నర్: 06
  • వెల్డర్: 03
  • రిఫ్రిజిరేషన్, ఏసీ: 02
  • సీవోపీఏ: 55
  • ఫ్లంబర్: 02
  • పెయింటర్: 05
  • డీజిల్ మెకానిక్: 01
  • మోటర్ వెహికల్ మెకానిక్: 01
  • డ్రాఫ్ట్స్‌మెన్ – సివిల్: 01
  • డ్రాఫ్ట్స్‌మెన్- మెకానికల్: 01

అర్హత:

  • అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు తమ దరఖాస్తులను ఇంటర్వ్యూ తేదీరోజు రిపోర్టింగ్ స్లాట్ సమయంలో అందచేయాలి.

శిక్షణ వ్యవధి:

  • ఒక సంవత్సరం.

ఇంటర్వ్యూ తేదీలు:

  • ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్: 20-05-2024.
  • రిపోర్టింగ్ టైం స్లాట్: ఉదయం 9 గంటలు.
  • ఫిట్టర్, ఫ్లంబర్, పెయింటర్: 20-05-2024.
  • రిపోర్టింగ్ టైం స్లాట్: మధ్యహ్నాం 1 గంటకు
  • సీవోపీఏ, మోటార్ వెహికల్ మెకానిక్: 21-05-2024.
  • రిపోర్టింగ్ టైం స్లాట్: ఉదయం 9 గంటలు.
  • ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్ – మెకానికల్: 21-05-2024.
  • రిపోర్టింగ్ టైం స్లాట్: మధ్యహ్నాం 1 గంటకు
  • మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & ఏసీ, టర్నర్: 22-05-2024.
  • రిపోర్టింగ్ టైం స్లాట్: ఉదయం 9 గంటలు.
  • డ్రాఫ్ట్స్‌మెన్ – సివిల్, వెల్డర్: 22-05-2024.
  • రిపోర్టింగ్ టైం స్లాట్: మధ్యహ్నాం 1 గంటకు

వేదిక:

  • Auditorium, Behind department of Training & Development,
    Hindustan Aeronautics Limited, Avionics Division, Balanagar, Hyderabad- 500042