iDreamPost
android-app
ios-app

1500 Bank జాబ్స్.. డిగ్రీ పాసైతే జాబ్ పక్కా.. మిస్ చేసుకోకండి

Indian Bank Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ 1500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ పాసైతే చాలు జాబ్ పక్కా.

Indian Bank Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ 1500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ పాసైతే చాలు జాబ్ పక్కా.

1500 Bank జాబ్స్.. డిగ్రీ పాసైతే జాబ్ పక్కా.. మిస్ చేసుకోకండి

ఇటీవల వివిధ బ్యాంకుల్లో పలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. క్లర్క్, అప్రెంటిస్, ఆఫీసర్ వంటి వేల సంఖ్యలో బ్యాంక్ జాబ్స్ భర్తీ అవుతున్నాయి. బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నవారికి ఇదే మంచి ఛాన్స్. డిగ్రీ అర్హతతోనే బ్యాంక్ జాబ్ సొంతం చేసుకోవచ్చు. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇండియన్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి. 01-07-2024 నాటికి అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 1500

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:

  • ఏపీలో 82, తెలంగాణలో 42.

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ట్రైనింగ్ పిరియడ్:

  • ఏడాది

ఎంపిక విధానం:

  • ఆన్ లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైఫండ్:

  • నెలకు మెట్రో/అర్భన్ శాఖల్లో రూ. 15 వేలు, గ్రామీణ/ సెమీ అర్భన్ శాఖల్లో రూ. 12 వేలు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500 ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ:

  • 10-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 31-07-2024