P Venkatesh
Yantra India Limited Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.
Yantra India Limited Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గం. వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ పరిస్థితులను మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంది. లక్షలు లేనోడు పేదోడు కాదు లక్ష్యం లేనోడు పేదోడు. లైఫ్ లో ఓ గోల్ ఏర్పర్చుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుంది. మంచి చదువులు ఉన్నతమైన ఉద్యోగాలను సాధించేందుకు తోడ్పడతాయి. ఉద్యోగం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకే యువత అంతా ఫస్ట్ ప్రియారిటీ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రియారిటీ ఇస్తుంటారు. ప్రైవేట్ సెక్టార్ లో లక్షల్లో జీతాలున్నప్పటికీ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కొలువులకు డిమాండ్ ఎక్కువ. మరి మీరు కూడా ఉద్యోగాన్వేషణలో ఉన్నారా? మంచి జాబ్ కొట్టి లైఫ్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రాత పరీక్ష రాయకుండానే ఉద్యోగాన్ని పొందొచ్చు. మంచి జీతంతో కూడిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని యంత్ర ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఐటీఐ, నాన్ ఐటీఐ కేటగిరీలో మొత్తం 3,883 పోస్టులను భర్తీచేయనున్నారు. మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడ్‌ల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నాన్-ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఐటీఐ అభ్యర్థులైతే కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ తో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 21వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.recruit-gov.com/Yantra2024/ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.