iDreamPost
android-app
ios-app

10th పాసై ఖాళీగా ఉన్నారా? రైల్వేలో 2,424 జాబ్స్ మీకోసమే.. మిస్ చేసుకోకండి

RRC Central Railway Apprentice Recruitment 2024: రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఏకంగా 2424 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

RRC Central Railway Apprentice Recruitment 2024: రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఏకంగా 2424 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

10th పాసై ఖాళీగా ఉన్నారా? రైల్వేలో 2,424 జాబ్స్ మీకోసమే.. మిస్ చేసుకోకండి

ప్రస్తుత రోజుల్లో నిరుద్యోగం ఎక్కువై పోయింది. ప్రైవేట్ రంగాల్లో కూడా జాబ్ దొరకడం కష్టంగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే చిన్న జాబ్ కు కూడా లక్షలాది మంది పోటీపడుతున్నారు. ఉద్యోగం పొందాలంటే కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే కాదు స్కిల్స్, ఇతర కోర్సులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతతో రైల్వేలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. సెంట్రల్ రైల్వే ఏకంగా 2424 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఇటీవల 18 వేలకు పైగా అసిస్టెంట్ లోకోపైలట్ జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2424 రైల్వే ఉద్యోగాల కోసం సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 15 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థుల వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 2424

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా.. గుర్తింపు పొందిన బోర్డు నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయోపరిమితి 15.7.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. టెన్త్, ఐటీఐలో సాధారణ సగటు మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 16-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 15-08-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి