P Venkatesh
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందొచ్చు. అభ్యర్థలు డిసెంబర్ 28 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందొచ్చు. అభ్యర్థలు డిసెంబర్ 28 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
P Venkatesh
వరల్డ్ వైడ్ గా అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం భారత్. భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ అత్యంత ప్రజాధారణ పొందింది. ఈ క్రమంలో రైల్వేలో సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తుంటుంది ఇండియన్ రైల్వేస్. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి భారతీయ రైల్వే తరచుగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- సౌత్ ఈస్ట్రన్ రైల్వే వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 28వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ https://www.rrcser.co.in/notice.html ను సందర్శించాలని కోరింది.