iDreamPost
android-app
ios-app

టెన్త్, ఐటీఐ అర్హతతో విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ ఖాళీలు

  • Published Nov 26, 2023 | 4:35 PM Updated Updated Nov 26, 2023 | 4:35 PM

నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఐటీఐ అర్హతతో వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 01 2024 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఐటీఐ అర్హతతో వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 01 2024 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

  • Published Nov 26, 2023 | 4:35 PMUpdated Nov 26, 2023 | 4:35 PM
టెన్త్, ఐటీఐ అర్హతతో విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ ఖాళీలు

టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త. వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ విభాగాల్లోని పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ) ఆధ్యార్యంలో పనిచేస్తున్న నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ పలు ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం ప్రక్రియను చేపట్టింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 275 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం విశాఖ నేవల్ డాక్ యార్డ్ అధికారిక వెబ్ సైట్ https://indiannavy.nic.in/content/civilian ను సందర్శించాలని సూచించింది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం అప్రెంటిస్ ఖాళీలు:

275

ట్రేడులు:

ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఆర్‌ అండ్‌ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.

అర్హత:

పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయసు 14 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,050. ఉంటుంది.

శిక్షణ వ్యవధి:

సంవత్సరం పాటు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

ఆన్‌ లైన్‌

అప్లికేషన్ కు చివరి తేదీ:

01-01-2024

రాతపరీక్ష తేది:

28-02-2024

ఫలితాల వెల్లడి:

02-03-2024.

ఇంటర్వ్యూ తేదీలు:

మార్చి 05 నుంచి 08-03-2024 వరకు.

ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడి:

14-03-2024.

మెడికల్ టెస్ట్ ప్రారంభ తేది:

16-03-2024.

శిక్షణ ప్రారంభం:

02-05-2024.

విశాఖ నేవల్ డాక్ యార్డ్ అధికారిక వెబ్‌సైట్‌:

https://indiannavy.nic.in/content/civilian

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş