Free Training: యువతులకు శుభవార్త.. ANM కోర్సుల్లో ఉచిత శిక్షణ.. ఇలా అప్లై చేసుకొండి

Kurnool Free ANM Course Training: యువతులకు భారీ శుభవార్త అని చెప్పవచ్చు. వారికి ఉచితంగా ఏఎన్‌ఎం కోర్సులో ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. ఆ వివరాలు..

Kurnool Free ANM Course Training: యువతులకు భారీ శుభవార్త అని చెప్పవచ్చు. వారికి ఉచితంగా ఏఎన్‌ఎం కోర్సులో ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. ఆ వివరాలు..

మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉద్యోగాలు కలిగిన రంగం ఏదైనా ఉందా అంటే మెడికల్‌ ఫీల్డే. రోజు రోజుకు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. ఇక మారుతున్న జీవన శైలి కారణంగా.. చిన్న వయసులోనే ఎన్నో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నాం. ఇక భవిష్యత్తులో కూడా ఏం రంగంలో నియమాకాలు తగ్గినా.. మెడికల్‌ ఫీల్డ్‌లో మాత్రం ఆ సమస్యే లేదు. ఇప్పటికే చాలా దేశాల్లో వైద్య సిబ్బంది కొరత ఉంది. దాంతో ఈ రంగంలో ఉద్యోగాలకు ఢోకా లేదు. కానీ అర్హులైన వ్యక్తులే లభించడం లేదు. మరీ ముఖ్యంగా నర్సులకు చాలా డిమాండ్‌ ఉంది. మన దేశంలో కన్నా.. విదేశాల్లో వీరికి డిమాండ్‌ ఎక్కువ. మరి మీరు కూడా ఈ ఫీల్డ్‌లో రాణించాలని భావిస్తున్నారా.. అయితే మీకో శుభవార్త.. ఉచితంగా ఏఎన్‌ఎం కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయితే మహిళలకు మాత్రమే ఈ అవకాశం.

వైద్య రంగంలో రాణించాలనుకునే వారికి మరి ముఖ్యంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్, కర్నూలులోని ప్రాంతీయ ఆస్పత్రి శుభవార్త చెప్పింది. ఏఎన్ఎం నర్సింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ వై.జయలక్ష్మి తెలిపారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ వరక్కర్‌, ఏఎన్‌ఎం కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు మీడియంలోనే రెండు సంవత్సరాల పాటు కోర్సును ఉచితంగా ఇస్తామన్నారు.

ఇంటర్ పాసైన వారు లేదా వొకేషనల్, వన్ సిట్టింగ్‌లో ఉత్తీర్ణత పొందిన మహిళా అభ్యర్థులు కూడా ఈ కోర్సులో చేరడానికి అర్హులన్నారు. ఈ ఏఎన్ఎం కోర్సుకు సంబంధించి మొత్తం 40 సీట్లు ఉన్నాయని, ఈనెల 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని ప్రిన్సిపల్ వై.జయలక్ష్మి తెలిపారు. అప్లై చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉచిత వసతి, ఉచిత వైద్యపరీక్షలు, ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఋ కోర్సు పూర్తి చేసుకున్న వారు ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

మరిన్ని వివరాలకు 85559 10104, 90593 27020,99590 30873, 94908 43980 అనే నంబర్లను కాల్‌ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అన్నారు. కావున ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Show comments