P Venkatesh
Bachelor of Fisheries Science: ఫ్యూచర్ బాగుండేందుకు విభిన్నమైన కోర్సులను చేయాలనుకుంటున్నారా? అయితే బీటెక్, ఫార్మసీలకు ఏమాత్రం తీసిపోని ఈ కోర్స్ చేస్తే భవిష్యత్ బంగారమే.
Bachelor of Fisheries Science: ఫ్యూచర్ బాగుండేందుకు విభిన్నమైన కోర్సులను చేయాలనుకుంటున్నారా? అయితే బీటెక్, ఫార్మసీలకు ఏమాత్రం తీసిపోని ఈ కోర్స్ చేస్తే భవిష్యత్ బంగారమే.
P Venkatesh
ఫ్యూచర్ లో హయ్యర్ పొజిషన్ లో సెటిల్ అవ్వాలంటే డిమాండ్ ఉన్న కోర్సులను చేస్తే ఇక తిరుగే ఉండదు. చాలా మంది బీటెక్, ఫార్మసీ కోర్సులు చేసేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తే లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందొచ్చని భావిస్తుంటారు. ఇక ఫార్మసీతో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులతో పాటు తక్కువ సమయంలోనే లైఫ్ లో త్వరగా సెటిల్ అయ్యే కోర్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫిషరీస్ సైన్స్. ఈ కోర్సు చేస్తే ఫ్యూచర్ కు తిరుగుండదు. జాబ్ అవకాశాలు ఈజీగా పొందొచ్చు. మరి మీరు కూడా ఫిషరీస్ సైన్స్ కోర్సు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఫిషరీస్ సైన్స్ తో గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్స్ పొందొచ్చు. ఇటీవల చేపల పెంపకం చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. మత్స్య పరిశ్రమ మంచి ఆదాయవనరుగా మారింది. చేపల పెంపకం తో మంచి రాబడి అందుకోవాలంటే ఫిషరీస్ సైంటిస్టు ఉండాల్సిందే. కాబట్టి ఫిషరీస్ సైన్స్ కోర్సుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఫిషరీస్ సైంటిస్టుగా రాణిస్తూ లక్షల్లో సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీఎఫ్‌యూ. ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ సాధించిన వారు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సరైన అర్హతలు గల విద్యార్థులు ఆలస్యరుసుముతో ఆగస్టు 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.