iDreamPost
android-app
ios-app

అరకోటి వేతనంతో జాబ్ సాధించిన తెలుగు అమ్మాయి

చదువుకు మార్కుల కొలమానం కాదూ కానీ.. ప్రతిభ చాలా ముఖ్యం. టాలెంట్ ఉంటే.. చదువు పూర్తవ్వకుండానే.. ఉద్యోగం వచ్చేస్తుంది. క్యాంపస్ సెలక్షన్స్ లో లక్షల ప్యాకేజీతో కొలువులు కొట్టొచ్చు. ఇదిగో ఈ అమ్మాయి కూడా

చదువుకు మార్కుల కొలమానం కాదూ కానీ.. ప్రతిభ చాలా ముఖ్యం. టాలెంట్ ఉంటే.. చదువు పూర్తవ్వకుండానే.. ఉద్యోగం వచ్చేస్తుంది. క్యాంపస్ సెలక్షన్స్ లో లక్షల ప్యాకేజీతో కొలువులు కొట్టొచ్చు. ఇదిగో ఈ అమ్మాయి కూడా

అరకోటి వేతనంతో జాబ్ సాధించిన తెలుగు అమ్మాయి

చదివిన చదువుకు పరమార్థం ఏంటంటే.. మంచి ఉద్యోగం సాధించడం. నేటి యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలంటూ కాలక్షేపం చేయకుండా ప్రైవేట్ జాబ్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం విద్యతో పాటు ఇతర కోర్సులు లేదా వారికి ఇష్టమైన రంగంలో ప్రావీణ్యం సంపాదించేందుకు విశేషమైన కృషి చేస్తున్నారు. దీని ఫలితంగా చిన్న వయస్సులో మంచి ప్యాకేజీతో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలను సాధిస్తున్నారు. వారి కళలను నెరవేర్చుకోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశలను తీరుస్తున్నారు. ముఖ్యంగా ఐటి రంగంలో మంచి ఉద్యోగం లభిస్తే.. లైఫ్ సెట్ అయినట్టే. అప్పటి వరకు పడిన కష్టాన్ని కూడా మరిపించగలదా జాబ్ అండ్ ప్యాకేజీ.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ పీరియడ్ నడుస్తుంది. ఈ ప్రభావం ఐటి రంగంపై ప్రభావం చూపుతోంది. బడా కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. కొత్త కొలువులు పుట్టడం కూడా కష్టం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి పది.. ఇరవై లక్షలు కాదూ రూ. 50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని కొల్లగొట్టింది. ఆ అమ్మాయి పేరు చల్లా సాయి కృతి. హైదరాబావ్ జేఎన్టీయూ విద్యార్థిని అయిన సాయి కృతి.. ప్లేస్‌మెంట్‌లో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ డీఈషా గ్రూప్‌లో రూ. 52 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి వెల్లడించారు.

కంపెనీలో ఒక ఉద్యోగానికి జరిగిన రాత పరీక్షకు జేఎన్టీయూ నుంచే వంద మందికి పైగా విద్యార్థులు పోటీ పడ్డారని చెప్పారు. మొత్తం మూడు రౌండ్లు జరగ్గా.. ఫైనల్ రౌండ్‌లో సాయి కృతి ఐటి ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. కాగా, సాయి కృతి ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది. ఎంసెట్‌లో 186వ ర్యాంక్ రాగా, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదివింది. మొత్తానికి ఆమె పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కింది. సర్వస్వతి కటాక్షంతో పాటు ధనలక్ష్మి  కరుణించింది.  ఇంత ప్యాకేజీతో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలక్ట్ అయిన  సాయి కృతి.. దీన్ని సాధించేందుకు ఎంతో శ్రమ పడిందో..?