P Venkatesh
PM Internship Scheme 2024: మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పీఎం ఇంటర్న్ షిప్ స్కీంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏడాదికి 60 వేలు పొందే ఛాన్స్. మిస్ చేసుకోకండి.
PM Internship Scheme 2024: మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పీఎం ఇంటర్న్ షిప్ స్కీంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏడాదికి 60 వేలు పొందే ఛాన్స్. మిస్ చేసుకోకండి.
P Venkatesh
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు నడుంబిగించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధికి మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నది. నిరుద్యోగుల కోసం ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీం ను ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉపాధి పొందడం సులువవుతుంది. ఈ స్కీమ్ నిరుద్యోగులకు వరమనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇంటర్న్ షిప్ కు ఎంపికైతే ఏడాదికి 60 వేలు పొందొచ్చు. అంటే 12 నెలలపాటు నెలకు రూ. 5 చొప్పున అందిస్తారు.
ఏకకాల గ్రాంటు కింద రూ. 6 వేలు కూడా ఇస్తారు. దేశంలోని 500 దిగ్గజ కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్ షిప్ చేసేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. www.pminternship.mca.gov.in ఆన్ లైన్ పోర్టల్ లో ఈ ఇంటర్న్ షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ కు 21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్, డిప్లొమా లేదా పాలిటెక్నిక్ వంటివి కలిగి ఉండాలి.
డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులను అక్టోబర్ 26న ఎంపిక చేస్తారు. ఇంటర్న్ షిప్ కోసం కంపెనీలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అగ్రి కల్చర్, ఆటోమోటివ్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్ ఇండస్ట్రీ, టాటా, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, ఇన్ఫోసిన్, హెచ్ డీఎఫ్ సీ, టెక్స్ టైల్, టెలికాం, మహీంద్రా, హీరో వంటి టాప్ కంపెనీల్లో 80 వేలకు పైగా ఇంటర్న్ షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వారు ఈ స్కీమ్ ద్వారా తమ ఫ్యూచర్ ను సెట్ చేసుకునే ఛాన్స్ కేంద్రం కల్పిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే అప్లై చేసుకోండి. పూర్తి వివరాలకు www.pminternship.mca.gov.in వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది.