iDreamPost
android-app
ios-app

IPL 2024.. SRHకి బిగ్ షాక్! ఆ ప్లేయర్ నిర్ణయంతో కొంపమునిగింది!

  • Published Mar 19, 2024 | 10:27 AM Updated Updated Mar 19, 2024 | 10:27 AM

ఒకే ఒక్క ప్లేయర్ తీసుకున్న నిర్ణయం మూలంగా ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకే ఒక్క ప్లేయర్ తీసుకున్న నిర్ణయం మూలంగా ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024.. SRHకి బిగ్ షాక్! ఆ ప్లేయర్ నిర్ణయంతో కొంపమునిగింది!

IPL 2024 టైటిల్ ను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందుకోసం మాస్టర్ ప్లాన్స్ కూడా రెడీ చేసుకుని, ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టాయి. అయితే కొన్ని జట్లకు గాయాలు షాకిస్తే.. మరికొన్ని టీమ్స్ కు ప్లేయర్లు షాకిస్తున్నారు. వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కప్ కొట్టాలన్న ఫ్రాంచైజీల కల.. కలగానే మిగిలిపోయేలా . తాజాగా ఓ స్టార్ ప్లేయర్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. మరి ఆ ఆటగాడు ఎవరు? అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి?

ఒకే ఒక్క ప్లేయర్ తీసుకున్న నిర్ణయం మూలంగా ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆడే తొలి 3 మ్యాచ్ లకు ఆ టీమ్ స్టార్ ప్లేయర్, శ్రీలంక టీ20 కెప్టెన్, ఆల్ రౌండర్ వనిందు హసరంగా దూరం కానున్నాడు. దానికి కారణం తాజాగా అతడు తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడమే. దీంతో బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు లంక క్రికెట్ బోర్డ్ అతడిని జట్టులోకి ఎంపిక చేసింది.

big shock for srh

కాగా.. సరిగ్గా ఐపీఎల్ ప్రారంభం అయ్యే రోజే అంటే మార్చి 22 నే ఈ టెస్ట్ సరీస్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 3న ముగుస్తుంది. దీంతో హైదరాబాద్ ఆడే తొలి మ్యాచ్ లకు అతడు దూరం కావాల్సి వస్తోంది. అయితే అతడు ఈ విషయాన్ని ముందుగానే SRH మేనేజ్ మెంట్ కు తెలిపినట్లు సమాచారం. కాగా.. వనిందు హసరంగా ప్రపంచ మేటి ఆల్ రౌండర్ గా ఎనలేని గుర్తింపు పొందాడు. అద్భుతమైన స్పిన్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. తన మాస్ హిట్టింగ్ తో బౌలర్లను ఊచకోత కోయగలడు. ఇలాంట ప్లేయర్ కొన్ని మ్యాచ్ లకు దూరమైతే అది పెద్ద దెబ్బే. ఇక ఐపీఎల్ వేలంలో ఈ లంక స్టార్ స్పిన్నర్ ను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే హసరంగా తీసుకున్న యూటర్న్ తో ఎస్ఆర్ హెచ్ కొంపమునిగిందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

ఇదికూడా చదవండి: వీడియో: మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన క్రికెటర్! క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..