టీమిండియా హెడ్​ కోచ్​గా హర్భజన్.. ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని ట్విస్ట్!

టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్​ను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. గంభీర్ నుంచి పాంటింగ్ వరకు చాలా మంది దిగ్గజాల పేర్లు కోచ్ రేసులో వినిపిస్తున్నాయి.

టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్​ను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. గంభీర్ నుంచి పాంటింగ్ వరకు చాలా మంది దిగ్గజాల పేర్లు కోచ్ రేసులో వినిపిస్తున్నాయి.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగనున్నాడు. భారత క్రికెక్ బోర్డు కోరడంతో తన పదవీ కాలం పూర్తయినా టీ20 వరల్డ్‌ కప్ వరకు కోచ్​గా ఉంటానని తెలిపాడు ద్రవిడ్. ఆ టైమ్ దగ్గర పడుతుండటంతో కొత్త కోచ్​ను తీసుకోమంటూ బోర్డుకు చెప్పాడు. దీంతో వేట ఆరంభించింది. కానీ గౌతం గంభీర్ నుంచి ఆస్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ వరకు ఈ రేసులో చాలా మంది పేర్లు వినిపించినా ఎవ్వరూ కన్ఫర్మ్ కాలేదు. అయితే తాజాగా ఇందులో ఇంకో దిగ్గజం పేరు బలంగా చెబుతున్నారు. అతడే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. భారత కొత్త కోచ్​గా భజ్జీని ఓకే చేశారని తెలుస్తోంది.

గంభీర్, పాంటింగ్, నెహ్రా, ఫ్లెమింగ్ కాదని.. హర్భజన్​ను నయా కోచ్​గా బీసీసీఐ నియమించిందని సమాచారం. ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించిన హర్భజన్.. దూకుడైన విధానం, అనుభవం, ఆటగాళ్లతో ఉన్న సత్సంబంధాలు లాంటివి బీసీసీఐని ఇంప్రెస్ చేశాయట. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ భారీగా మ్యాచ్​లు ఆడి ఉండటం, బౌలింగ్​తో పాటు బ్యాటింగ్ ఎబిలిటీస్ మీద కూడా అవగాహన ఉండటంతో భజ్జీని కోచ్​గా తీసుకుంటే జట్టు అన్ని విధాలుగా మరింత మెరుగుపడుతుందనే ఉద్దేశంతోనే హర్భజన్ వైపు బోర్డు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటి జనరేషన్ ప్లేయర్లతో ఈజీగా కలుపుకొని పోతూ టీమ్​ను సక్సెస్​ఫుల్​గా నడిపించడం అతడి వల్ల అవుతుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట.

భజ్జీ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఆసక్తిగా ఉన్నాడని క్రికెట్ సర్కిల్స్​లో చెప్పుకుంటున్నారు. దీని గురించి బోర్డు అధికారులతో అతడు కూడా చర్చలు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే హెడ్ కోచ్​ పదవికి అతడు దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అనేది ఇంకా తెలియదు. హెడ్​ కోచ్​గా ఈ మాజీ స్పిన్నర్​ను తీసుకున్నారనే ఊహాగానాల నేపథ్యంలో అటు బీసీసీఐ నుంచి గానీ ఇటు భజ్జీ నుంచి గానీ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక కూడా ప్రకటన రాలేదు. మరోవైపు హర్భజన్ నయా కోచ్ అనే న్యూస్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని ట్విస్ట్ అని అంటున్నారు. గంభీర్ అవుతాడనుకుంటే సడెన్​గా హర్భజన్​ రేసులోకి వచ్చాడని చెబుతున్నారు. మరి.. భజ్జీని కోచ్​గా చూడాలని మీరు అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments