iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ టీమ్​లోకి రాహుల్ బదులు సంజూ​ను తీసుకోవడానికి అదే కారణం: అగార్కర్

  • Published May 02, 2024 | 6:07 PM Updated Updated May 02, 2024 | 6:07 PM

సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్​ను కాదని సంజూ శాంసన్​ను టీ20 వరల్డ్ కప్ టీమ్​లోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న కారణాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరించారు.

సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్​ను కాదని సంజూ శాంసన్​ను టీ20 వరల్డ్ కప్ టీమ్​లోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న కారణాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరించారు.

  • Published May 02, 2024 | 6:07 PMUpdated May 02, 2024 | 6:07 PM
వరల్డ్ కప్ టీమ్​లోకి రాహుల్ బదులు సంజూ​ను తీసుకోవడానికి అదే కారణం: అగార్కర్

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఇటీవలే బోర్డు అనౌన్స్ చేసింది. అయితే ఇందులో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్​కు చోటు దక్కకపోవడం కాంట్రవర్సీగా మారింది. రోడ్డు ప్రమాదం కారణంగా రిషబ్ పంత్ రెండేళ్లు జట్టుగా దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో బ్యాటర్​గా, వికెట్ కీపర్​గా టీమ్​కు సేవలు అందించాడు రాహుల్. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో కీపింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ అదరగొట్టాడు. టీమిండియా ఫైనల్​కు చేరడంలో అతడి కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. అలాంటోడి ప్లేస్​లో సంజూ శాంసన్​ను టీమ్​లోకి తీసుకున్నారు. దీంతో రాహుల్​కు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాహుల్​కు బదులు సంజూ శాంసన్​ను ఎందుకు వరల్డ్ కప్ స్క్వాడ్​లోకి తీసుకున్నారు అనే దానిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రియాక్ట్ అయ్యారు. బీసీసీఐ హెడ్ క్వార్టర్స్​లో నిర్వహించిన ప్రెస్ మీట్​లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ కప్ జట్టు ఎంపిక గురించి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగానే రాహుల్​-సంజూ అంశం మీదా రియాక్ట్ అయ్యారు. ఒకే ఒక్క కారణం వల్లే శాంసన్ టీమ్​లోకి వచ్చాడన్నారు. అదే మిడిరార్డర్​లోనూ బ్యాటింగ్ చేసే ఎబిలిటీ అని తెలిపారు. రాహుల్ టాపార్డర్ బ్యాటర్ అని.. కానీ తాము మాత్రం మిడిలార్డర్​లో ఆడే వికెట్ కీపర్ కోసం వెతికామని అన్నారు. సంజూ శాంసన్ అయితే డౌన్ ది ఆర్డర్​లో కూడా వచ్చి బ్యాటింగ్ చేయగలడని.. అతడి సామర్థ్యం మీద తమకు పూర్తి నమ్మకం ఉండటంతో తీసుకున్నామని పేర్కొన్నారు.

‘కేఎల్ రాహుల్ టాపార్డర్​లో బ్యాటింగ్​కు దిగుతాడు. కానీ మేం మిడిలార్డర్​లో ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ కోసం వెతికాం. బ్యాటింగ్ ఆర్డర్​లో కిందకు వచ్చి ఆడే ఎబిలిటీ సంజూ శాంసన్​కు ఉంది. జట్టులో ఏ స్లాట్​లో ఏ ప్లేయర్ ఫిట్ అవుతాడో చూసి భర్తీ చేయాలి. మేం సరిగ్గా అదే చేశాం. పంత్, సంజూను టీమ్​లోకి తీసుకోవడానికి ఇదే రీజన్’ అని అగార్కర్ స్పష్టం చేశారు. కాగా, వరల్డ్ కప్ స్క్వాడ్​లో చోటు దక్కకపోవడంతో రాహుల్ చాలా నిరాశ చెందాడు. ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో అతడు డిప్రెషన్​లో ఉన్నట్లు కనిపించాడు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు అతడి ముఖంలో నవ్వు లేదు. అతడి కళ్లలో బాధ కూడా స్పష్టంగా కనిపించింది. దీంతో అతడికి అన్యాయం చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. రాహుల్​కు బదులు సంజూను తీసుకోవడానికి మిడిలార్డర్​లో బ్యాటింగ్ చేసే ఎబిలిటీనే కారణం అని అగార్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.