iDreamPost
android-app
ios-app

వీడియో: నటరాజన్ వన్ మ్యాన్ షో.. ఒక్క ఓవర్ తో మ్యాచ్ నే మార్చేశాడు!

T Natarajan Best Spell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మారు మోగుతోంది. ఎక్కడ చూసినా హైదరాబాద్ జట్టు గురించే పెద్ద ఎత్తున చర్చ. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.

T Natarajan Best Spell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మారు మోగుతోంది. ఎక్కడ చూసినా హైదరాబాద్ జట్టు గురించే పెద్ద ఎత్తున చర్చ. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.

వీడియో: నటరాజన్ వన్ మ్యాన్ షో.. ఒక్క ఓవర్ తో మ్యాచ్ నే మార్చేశాడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఎక్కడ చూసినా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరే వినిపిస్తోంది. వారి ప్రదర్శనతో కేవలం ఫ్యాన్స్ హృదయాలనే కాదు.. ప్రత్యర్థుల మనసులు కూడా గెలుచుకుంటున్నారు. మ్యాచ్ మ్యాచ్ కి ఒక్కే మెట్టు ఎక్కుతూ తమని తాము మెరుగు పరుచుకుంటున్నారు. 300 స్కోర్ కొట్టాలి అనే టార్గెట్ ని జస్ట్ లో మిస్ చేసుకున్నారు. కానీ, ఆ టార్గెట్ ని మాత్రం ఈ సీజన్ లో రీచ్ అవుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ అంటే సాదా సీదా టీమ్ కాదు అనే అభిప్రాయానికి అంతా వచ్చేశారు. ముఖ్యంగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ యూనిట్ కూడా ఫామ్ లోకి వచ్చేసింది. సమిష్టి ప్రదర్శనతో అంతా అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా ఇది నటరాజన్ స్పెషల్ అనే చెప్పాలి.

ఈ మ్యాచ్ లో వింటేజ్ నటరాజన్ ని చూశామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. ఎక్కడా కూడా వారికి ఆస్కారం లేకుండా విజృంభించాడు. ముఖ్యంగా 19వ ఓవర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. డెత్ ఓవర్ ని మెయిడెన్ చేయడం మాత్రమే కాకుండా.. ఆ ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 19వ ఓవర్ చూస్తే తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత డాట్ బాల్ వేశాడు. తర్వాత వరుసగా 2 బంతులకు 2 వికెట్లు తీసుకున్నాడు. ఆఖరి రెండు బంతులను డాట్స్ వేశాడు.

ఈ ఓవర్లో అక్షర్ పటేల్(6), నోర్ట్జే(0), కుల్దీప్ యాదవ్(గోల్డెన్ డక్) వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అలాగే ఈ మ్యాచ్ లో నటరాజన్ తీసిన లలిత్ యాదవ్(7) వికెట్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఆ యార్కర్ చూస్తే వింటేజ్ నట్టు వచ్చేశాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా ప్రత్యర్థులకు ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్ లో వేసిన స్పెల్ చూస్తే 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. వాటిలో ఒక మెయిడెన్ కూడా ఉంది. నటరాజన్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

వాటిలో కూడా ముఖ్యంగా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ కూడా నటరాజన్ బౌలింగ్ కి ఫిదా అయిపోయాడు. మ్యాచ్ తర్వాత నటరాజన్ పై ప్రశంసలు కురిపించాడు. నటరాజన్ చాలా సైలెంట్ గా ఉంటాడని.. కానీ, బౌలింగ్ కి వచ్చాక మాత్రం యార్కర్లతో విరుచుకుపడతాడు అంటూ వ్యాఖ్యానించాడు. యార్కర్లు వేయడంలో నటరాజన్ నేర్పరి అంటూ పొగిడేశాడు. మొత్తానికి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 67 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ మాత్రం తప్పకుండా గుర్తుండిపోయేది అవుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే సీజన్లో మూడుసార్లు 250+ పరుగులు నమోదు చేశారు.