క్రికెటే శ్వాసగా ఎదిగిన ఓ కుర్రాడి కథ.. SRH నయా స్టార్ నితీష్ రెడ్డి లైఫ్ స్టోరీ ఇదే!

క్రికెటే శ్వాసగా ఎదిగిన ఆ కుర్రాడు ఇప్పుడు సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు నయా స్టార్​గా మారాడు. పేదరికాన్ని జయించి విజయం సాధించిన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. నితీష్​ కుమార్ రెడ్డి.

క్రికెటే శ్వాసగా ఎదిగిన ఆ కుర్రాడు ఇప్పుడు సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు నయా స్టార్​గా మారాడు. పేదరికాన్ని జయించి విజయం సాధించిన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. నితీష్​ కుమార్ రెడ్డి.

క్రికెటే శ్వాసగా ఎదిగాడా కుర్రాడు. చిన్నతనం నుంచే జెంటిల్మన్ గేమ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. బ్యాట్ పట్టి బంతిని బాదడమే కాదు, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లు తీయడం కూడా నేర్చుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే ఆంధ్ర టీమ్​కు ఆడాడు. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఐపీఎల్ వరకు వచ్చాడు. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, పేదరికం వెనక్కి లాగినా.. అతడు మాత్రం గన్​లో నుంచి ఫైర్ అయిన బుల్లెట్ మాదిరిగా రివ్వున దూసుకెళ్లాడు. హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ లాంటి టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఫెయిలైన చోట.. విధ్వంసక ఇన్నింగ్స్​తో సన్​రైజర్స్​ను గెలిపించాడు. ఆ కుర్రాడే తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి.

ఎవరీ నితీష్ రెడ్డి?

సీఎస్​కేతో జరిగిన మ్యాచ్​లో ఆఖర్లో వచ్చి భారీ షాట్లతో మ్యాచ్​ను ఫినిఫ్ చేశాడు నితీష్​. పంజాబ్ కింగ్స్ మీద 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఒక వికెట్ తీయడంతో పాటు ఓ క్యాచ్ కూడా పట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డిది విశాఖపట్నం. 2003, మే 26న అక్కడే పుట్టాడతను. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్​లో వర్క్ చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. నితీష్​ తల్లి పేరు మానస జ్యోత్స్న.

తండ్రి త్యాగం వృథా కాలేదు

చిన్నతనం నుంచే క్రికెట్ అంటే నితీష్​కు ఎనలేని మక్కువ. 5 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకొని సరదాగా ఆడుతుండేవాడు. దీంతో అతడ్ని క్రికెటర్​ను చేయాలని తండ్రి ముత్యాల రెడ్డి డిసైడ్ అయ్యాడు. కొడుక్కి ట్రెయినింగ్ ఇప్పించాడు. 14 ఏళ్ల వయసులో విజయ్ మర్చంట్ ట్రోఫీ (2017-18)తో అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు నితీష్​. 176 స్ట్రైక్ రేట్​తో 1,237 పరుగులు చేశాడు. బౌలింగ్​లోనూ 26 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో ఆ ఏడాదికి గానూ బెస్ట్ క్రికెటర్ ఇన్ అండర్-16 జగన్మోహన్ దాల్మియా పురస్కారానికి ఎంపికయ్యాడు. అయితే ఆ టైమ్​లో నితీష్​ తండ్రికి ఉదయ్​పూర్​కు ట్రాన్స్​ఫర్ అయింది. కానీ ఆయన జాబ్​ను వదిలేశాడు. కొడుకు కెరీర్ కోసం వైజాగ్​లోనే ఉండిపోయాడు.

తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు నితీష్. పేదరికం వెంటాడుతున్నా మరింత కసితో, పట్టుదలతో ఆడాడు. రాత్రింబవళ్లు ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. ఎట్టకేలకు రంజీ ట్రోఫీ-2020లో ఆంధ్ర టీమ్ తరఫున ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది లిస్ట్​-ఏ క్రికెట్​లో డెబ్యూ ఇచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్​లో బ్యాట్​తో పాటు బంతితోనూ రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు నితీష్. దీంతో అతడ్ని ఐపీఎల్-2024కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్​కు సన్​రైజర్స్ దక్కించుకుంది. గతేడాది ఆర్సీబీతో ట్రావెల్ అయ్యాడు నితీష్. కానీ అతడ్ని ఆ టీమ్ పెద్దగా వాడుకోలేదు. ఎస్​ఆర్​హెచ్ మాత్రం అతడిలోని టాలెంట్​ను గుర్తించి ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. దాని ఫలితమే పంజాబ్ కింగ్స్​పై గెలుపు. ఇక, లిస్ట్​-ఏ క్రికెట్​లో 403 పరుగులు చేసిన నితీష్​.. 14 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 17 మ్యాచుల్లో 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. మరి.. నితీష్ కెరీర్​లో ఎక్కడి దాకా వెళ్లగలడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: క్లాసెన్ సూపర్​ఫాస్ట్ స్టంపింగ్.. 140 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బాల్​ను..!

Show comments