iDreamPost

వీడియో: క్లాసెన్ సూపర్​ఫాస్ట్ స్టంపింగ్.. 140 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బాల్​ను..!

  • Published Apr 10, 2024 | 12:49 PMUpdated Apr 10, 2024 | 12:49 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సూపర్​ఫాస్ట్ స్టంపింగ్​తో అదరగొట్టాడు. బ్యాటింగే కాదు.. కీపింగ్​లోనూ తాను తోపేనని అతడు ప్రూవ్ చేసుకున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సూపర్​ఫాస్ట్ స్టంపింగ్​తో అదరగొట్టాడు. బ్యాటింగే కాదు.. కీపింగ్​లోనూ తాను తోపేనని అతడు ప్రూవ్ చేసుకున్నాడు.

  • Published Apr 10, 2024 | 12:49 PMUpdated Apr 10, 2024 | 12:49 PM
వీడియో: క్లాసెన్ సూపర్​ఫాస్ట్ స్టంపింగ్.. 140 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బాల్​ను..!

హెన్రిచ్ క్లాసెన్.. ఈ పేరు వినగానే అందరికీ విధ్వంసక బ్యాటర్ గుర్తుకొస్తాడు. సింగిల్ హ్యాండ్​తో సౌతాఫ్రికా జట్టుకు ఎన్నో విక్టరీలు అందించాడతను. ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ మరింత పేరు తెచ్చుకున్నాడు క్లాసెన్. ఓడిపోయే మ్యాచుల్లో కూడా తన బ్యాటింగ్ ప్రతిభతో ఎస్​ఆర్​హెచ్​ను ఒడ్డున పడేశాడు. అతడు క్రీజులో ఉంటే ఎంతటి బౌలర్ అయినా గడగడలాడాల్సిందే. అయితే మెరుపు బ్యాటింగ్​తో ఇంత క్రేజ్ సంపాదించిన క్లాసెన్​లో ఓ అద్భుతమైన కీపర్ కూడా ఉన్నాడు. ఇది పంజాబ్ కింగ్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో బయటపడింది. గత సీజన్లలో కూడా ఎస్​ఆర్​హెచ్ కీపింగ్ బాధ్యతల్ని మోసిన క్లాసెన్.. పంజాబ్​తో మ్యాచ్​లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్​ఫాస్ట్ స్టంపింగ్​తో అందర్నీ షాక్​కు గురిచేశాడతను.

పంజాబ్​తో మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆతిథ్య జట్టును ఎస్​ఆర్​హెచ్ బౌలర్లు వణికించారు. స్వింగ్​కు పిచ్ అనుకూలిస్తుండటంతో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ చెలరేగిపోయారు. భువీ వేసిన ఫస్ట్ ఓవర్ మెయిడిన్ అయింది. నెక్స్ట్ ఓవర్​లో బెయిర్​స్టోను క్లీన్​బౌల్డ్ చేశాడు కమిన్స్. దీంతో ప్రెజర్​లో పడ్డాడు శిఖర్ ధావన్ (14). పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డ పంజాబ్ కెప్టెన్.. ఐదో ఓవర్​లో భువీ బౌలింగ్​లో ఔటయ్యాడు. సాధారణంగా పేసర్ల బౌలింగ్​లో వికెట్లు వదిలేసి ఆడేందుకు ధావన్ ఇష్టపడతాడు. కాస్త ముందుకొచ్చి షాట్లు కొట్టడం అతడి స్టైల్. కానీ నిన్నటి మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ కీపర్ క్లాసెన్ అతడి ముందరికాళ్లకు బంధం వేశాడు.

ధావన్​ను ఔట్ చేసేందుకు భువీని బౌలింగ్​కు దింపాడు సన్​రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అలాగే కీపర్ క్లాసెన్​ను వికెట్ల మీదకు రావాలని సూచించాడు. ఈ ట్రిక్ వర్కౌట్ అయింది. షాట్స్ కనెక్ట్ కాకపోవడం, ముందుకు వెళ్లడానికి ఛాన్స్ లేకపోవడంతో ధావన్ ఫ్ట్రస్టేషన్​కు గురయ్యాడు. ఆ ఓవర్​ నాలుగో బంతికి ముందుకొచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. భువీ గుడ్​లెంగ్త్​లో వేసిన ఆ బాల్​ను టచ్ కూడా చేయలేకపోయాడు. అయితే 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని వికెట్ల వెనుక రెడీగా ఉన్న క్లాసెన్ అందుకున్నాడు. ధావన్ తిరిగి క్రీజును చేరేలోపే స్టంప్స్​ను గిరాటేశాడు. దీంతో పంజాబ్ కెప్టెన్ షాకయ్యాడు. అంత స్పీడ్​గా వచ్చిన బాల్​ను క్యారీ చేయడం, పర్ఫెక్ట్ టైమింగ్​తో స్టంపౌట్ చేయడంతో పిచ్చోడైపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఇది ధోనీని మించిన స్టంపింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. మరి.. క్లాసెన్ సూపర్​ఫాస్ట్ స్టంపింగ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి