Nidhan
క్రికెటే శ్వాసగా ఎదిగిన ఆ కుర్రాడు ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నయా స్టార్‌గా మారాడు. పేదరికాన్ని జయించి విజయం సాధించిన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. నితీష్ కుమార్ రెడ్డి.
క్రికెటే శ్వాసగా ఎదిగిన ఆ కుర్రాడు ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నయా స్టార్‌గా మారాడు. పేదరికాన్ని జయించి విజయం సాధించిన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. నితీష్ కుమార్ రెడ్డి.
Nidhan
క్రికెటే శ్వాసగా ఎదిగాడా కుర్రాడు. చిన్నతనం నుంచే జెంటిల్మన్ గేమ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. బ్యాట్ పట్టి బంతిని బాదడమే కాదు, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లు తీయడం కూడా నేర్చుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే ఆంధ్ర టీమ్‌కు ఆడాడు. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఐపీఎల్ వరకు వచ్చాడు. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, పేదరికం వెనక్కి లాగినా.. అతడు మాత్రం గన్‌లో నుంచి ఫైర్ అయిన బుల్లెట్ మాదిరిగా రివ్వున దూసుకెళ్లాడు. హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ లాంటి టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఫెయిలైన చోట.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించాడు. ఆ కుర్రాడే తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి.
సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చి భారీ షాట్లతో మ్యాచ్‌ను ఫినిఫ్ చేశాడు నితీష్. పంజాబ్ కింగ్స్ మీద 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఒక వికెట్ తీయడంతో పాటు ఓ క్యాచ్ కూడా పట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డిది విశాఖపట్నం. 2003, మే 26న అక్కడే పుట్టాడతను. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్‌లో వర్క్ చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. నితీష్ తల్లి పేరు మానస జ్యోత్స్న.
చిన్నతనం నుంచే క్రికెట్ అంటే నితీష్‌కు ఎనలేని మక్కువ. 5 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకొని సరదాగా ఆడుతుండేవాడు. దీంతో అతడ్ని క్రికెటర్‌ను చేయాలని తండ్రి ముత్యాల రెడ్డి డిసైడ్ అయ్యాడు. కొడుక్కి ట్రెయినింగ్ ఇప్పించాడు. 14 ఏళ్ల వయసులో విజయ్ మర్చంట్ ట్రోఫీ (2017-18)తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు నితీష్. 176 స్ట్రైక్ రేట్‌తో 1,237 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 26 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో ఆ ఏడాదికి గానూ బెస్ట్ క్రికెటర్ ఇన్ అండర్-16 జగన్మోహన్ దాల్మియా పురస్కారానికి ఎంపికయ్యాడు. అయితే ఆ టైమ్‌లో నితీష్ తండ్రికి ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఆయన జాబ్‌ను వదిలేశాడు. కొడుకు కెరీర్ కోసం వైజాగ్‌లోనే ఉండిపోయాడు.
తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు నితీష్. పేదరికం వెంటాడుతున్నా మరింత కసితో, పట్టుదలతో ఆడాడు. రాత్రింబవళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ఎట్టకేలకు రంజీ ట్రోఫీ-2020లో ఆంధ్ర టీమ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది లిస్ట్-ఏ క్రికెట్లో డెబ్యూ ఇచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు నితీష్. దీంతో అతడ్ని ఐపీఎల్-2024కు ముందు జరిగిన మినీ ఆక్షన్‌లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు సన్‌రైజర్స్ దక్కించుకుంది. గతేడాది ఆర్సీబీతో ట్రావెల్ అయ్యాడు నితీష్. కానీ అతడ్ని ఆ టీమ్ పెద్దగా వాడుకోలేదు. ఎస్ఆర్హెచ్ మాత్రం అతడిలోని టాలెంట్‌ను గుర్తించి ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. దాని ఫలితమే పంజాబ్ కింగ్స్‌పై గెలుపు. ఇక, లిస్ట్-ఏ క్రికెట్లో 403 పరుగులు చేసిన నితీష్.. 14 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17 మ్యాచుల్లో 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. మరి.. నితీష్ కెరీర్లో ఎక్కడి దాకా వెళ్లగలడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: క్లాసెన్ సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్.. 140 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బాల్‌ను..!
NITISH KUMAR REDDY HAS ARRIVED FOR SRH. 🔥 pic.twitter.com/WSjO6YhH4q
— Johns. (@CricCrazyJohns) April 9, 2024