Sunil Narine: నరైన్ సరికొత్త చరిత్ర.. టీమిండియా స్టార్లు కూడా సాధించలేకపోయారు!

ఈ ఐపీఎల్ సీజన్ లో సునీల్ నరైన్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేేస్తూ.. దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు కూడా సాధించలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో సునీల్ నరైన్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేేస్తూ.. దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు కూడా సాధించలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ప్రేక్షకులకు కిక్కిచ్చింది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్క రన్ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది కేకేఆర్ టీమ్. చివరి బాల్ వరకు నరాలుతెగే ఉత్కంఠతతో జరిగిన ఈ మ్యాచ్ లో పోరాడి ఓడిపోయింది ఆర్సీబీ.ఇక ఈ పోరులో కేకేఆర్ స్టార్ ప్లేయర్, విండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ ఐపీఎల్ లో సరికొత్త చరిత్రను సృష్టించాడు. టీమిండియా స్టార్ ప్లేయర్లు సైతం సాధించలేని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రేర్ ఫీట్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సునీల్ నరైన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్న ప్లేయర్లలో ఒకడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తూ.. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్రపోషిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైయ్యాడు నరైన్. కానీ బౌలింగ్ లో రాణించి, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రార్ ను ఔట్ చేసి టీమ్ విజయానికి దోహదపడ్డాడు. అయితే ఈ రెండు వికెట్లను తీసుకోవడం ద్వారా ఐపీఎల్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు సునీల్ నరైన్. IPL చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు కేకేఆర్ తరఫున 169 మ్యాచ్ లు ఆడి 172 వికెట్లు పడగొట్టాడు నరైన్. 5/19 బెస్ట్ బౌలింగ్ గా నమోదు చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే లసిత్ మలింగ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మలింగ గతంలో ముంబై ఇండియన్స్ తరఫున 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు నేలకూల్చాడు. ఈ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు నరైన్. ఈ లిస్ట్ లో టీమిండియా స్టార్ బౌలర్లు నరైన్ కు కాస్త దూరంగానే ఉన్నాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(158 వికెట్లు, ముంబై టీమ్), భువనేశ్వర్ కుమార్(150, SRH), డ్వేన్ బ్రావో(140, చెన్నై) టాప్ ఫైవ్ లో ఉన్నారు. టీమిండియా స్టార్లను కాదని నరైన్ ఈ ఘనత సాధించడంతో.. అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం 223 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ 221 రన్స్ కి ఆలౌట్ అయ్యి.. ఒక్క పరుగుతో ఓడిపోయింది. మరి ఈ ఐపీఎల్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ.. దూసుకెళ్తున్న సునీల్ నరైన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments