iDreamPost
android-app
ios-app

కమిన్స్ వెనుక KGF రేంజ్ ఫ్లాష్​బ్యాక్! ఆ ఒక్క ఘటనతో అద్భుత కెప్టెన్​గా అవతారం!

  • Published May 25, 2024 | 6:31 PM Updated Updated May 25, 2024 | 6:31 PM

కప్పు కలను నెరవేర్చుకునే పనిలో మరో ముందడుగు వేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. రాజస్థాన్ రాయల్స్​ను చిత్తు చేసి ఐపీఎల్-2024 ఫైనల్స్​కు చేరుకుంది. టైటిల్​కు ఇంకో అడుగు దూరంలో నిలిచింది.

కప్పు కలను నెరవేర్చుకునే పనిలో మరో ముందడుగు వేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. రాజస్థాన్ రాయల్స్​ను చిత్తు చేసి ఐపీఎల్-2024 ఫైనల్స్​కు చేరుకుంది. టైటిల్​కు ఇంకో అడుగు దూరంలో నిలిచింది.

  • Published May 25, 2024 | 6:31 PMUpdated May 25, 2024 | 6:31 PM
కమిన్స్ వెనుక KGF రేంజ్ ఫ్లాష్​బ్యాక్! ఆ ఒక్క ఘటనతో అద్భుత కెప్టెన్​గా అవతారం!

సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. కృషి, పట్టుదలతో తమ కలల్ని నిజం చేసుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అథ: పాతాళం నుంచి అత్యున్నత శిఖరాలను చేరే క్రమంలో ఎన్నో కష్టనష్టాలను చూడాల్సి ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడితేనే అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు. జీవితంలో జరిగే కొన్ని ఘటనలే వారిని విజేతలను చేస్తాయి. గెలవాలనే కసిని, తపనను పెంచుతాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లైఫ్​లోనూ ఇలాంటి ఓ కీలకమైన ఘటన జరిగింది. అది అతడ్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు జస్ట్ బౌలర్​గా ఉన్నోడు.. ఇప్పుడు తోపు బౌలర్​గా, గ్రేట్ కెప్టెన్​గా ఎదిగాడు. దీనికి ఆ ఘటనే కారణం.

ఐపీఎల్ కప్పు కలను నెరవేర్చుకునే పనిలో మరో ముందడుగు వేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు. క్వాలిఫైయర్స్​-2లో రాజస్థాన్ రాయల్స్​ను చిత్తు చేసి ఫైనల్స్​కు చేరుకుంది. టైటిల్​కు ఇంకో అడుగు దూరంలో నిలిచింది. సండే ఫైట్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ను ఓడిస్తే కప్పు ఆరెంజ్ ఆర్మీ సొంతం అవుతుంది. గత సీజన్​లో పదో పొజిషన్​లో ఉన్న జట్లు ఇప్పుడు ఫైనల్​కు చేరుకుందంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఎన్ని కారణాలున్నా.. అన్నింటి కంటే బిగ్ రీజన్ కెప్టెన్ కమిన్స్. అతడి సారథ్యం వల్లే టీమ్ ఈ స్థాయికి చేరుకుంది. ఒక ఏడాది వ్యవధిలో ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్, యాషెస్ ట్రోఫీలు అందించాడు కమిన్స్. ఇప్పుడు ఎస్​ఆర్​హెచ్​ను ఛాంపియన్​గా నిలబెట్టేందుకు పోరాడుతున్నాడు. అయితే అతడి సక్సెస్ వెనుక కేజీఎఫ్ రేంజ్ ఫ్లాష్​బ్యాక్ ఉంది. అమ్మ ప్రేమే అతడ్ని ఈ స్థాయికి చేర్చింది.

కమిన్స్ విజయాల​ వెనుక ఓ కన్నీటి కథ ఉంది. అతడికి తల్లి మరియా అంటే పిచ్చి ప్రేమ. ఆమె కోసం ఏం చేయడానికైనా కమిన్స్ సిద్ధంగా ఉంటాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతూ కొడుకు మంచి పేరు తెచ్చుకుంటే ఆమె ఎంతో సంతోషించింది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్​తో బాధపడుతూ గతేడాది మార్చిలో ఆమె కన్నుమూసింది. అయితే మరణానికి కొన్ని రోజుల ముందు కమిన్స్​కు ఆమె ధైర్యం నూరిపోసింది. తన గురించి కాదు.. కెరీర్ గురించి ఆలోచించాలని చెప్పింది. ఇదే విషయాన్ని కమిన్స్ ఇటీవల షేర్ చేశాడు. వెళ్లు.. ప్రపంచాన్ని ఏలు, అది నీదే, నువ్వు ఛాంపియన్​వి అని తన తల్లి చెప్పిందన్నాడు. ఈ ఒక్క ఘటనతో కమిన్స్ పూర్తిగా మారిపోయాడు. కెప్టెన్​గా కొత్త కథను రాయడం మొదలుపెట్టాడు. ఫియర్​లెస్ అప్రోచ్​తో క్రికెట్ వరల్డ్​ను భయపెట్టాడు. ఏడాది గ్యాప్​లో రెండు ఐసీసీ ట్రోఫీలను ఆసీస్​కు అందించాడు. ఇప్పుడు ఎస్​ఆర్​హెచ్​ను కూడా ఛాంపియన్​ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి.. కమిన్స్ ఆరెంజ్ ఆర్మీ కప్పు కల తీరుస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tagalabettandi sir (@tagalabettandi_sir)