iDreamPost
android-app
ios-app

వీడియో: భువన్వేశ్వర్ స్వింగ్ మ్యాజిక్.. ఎన్నాళ్లైంది భువీని ఇలా చూసి..!

SRH vs RR- Bhuvneshwar Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో తెలుగు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రాజస్థాన్ తో మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ తో అదరగొట్టాడు.

SRH vs RR- Bhuvneshwar Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో తెలుగు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రాజస్థాన్ తో మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ తో అదరగొట్టాడు.

వీడియో: భువన్వేశ్వర్ స్వింగ్ మ్యాజిక్.. ఎన్నాళ్లైంది భువీని ఇలా చూసి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ హవా కొనసాగుతూనే ఉంది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అసలు సిసలైన పోరాటాన్ని చూయించింది. ఎర్లీ వికెట్స్ కోల్పోయిన దశలో.. స్లో అండ్ స్టడీగా ఆటను ముందుకు తీసుకెళ్లారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒక చిన్న సునామీని సృష్టించారు. 150 పరుగులు కూడా చేయలేరు అనుకున్న దశ నుంచి ఏకంగా 201 పరుగులు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఒక్క బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ యూనిట్ కూడా అద్భుతం చేసింది. ముఖ్యంగా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన సత్తా చాటాడు.

భువనేశ్వర్ కుమార్ కు స్వింగ్ కింగ్ అనే పేరు ఊరికే రాలేదు. అతను వేసే డెలివరీలకు ప్రత్యర్థులు కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. కానీ, ఈ సీజన్లో భువీ నుంచి అంతటి మ్యాజిక్ ని చూడలేకపోయాం. రన్స్ ని కంట్రోల్ చేస్తున్నా కూడా వింటేజ్ భువనేశ్వర్ ని చూడలేకపోతున్నాం అనే బాధ అయితే ఉండిపోయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భువనేశ్వర్ స్వింగ్ ని మిస్ అవుతూ ఉన్నారు. ఆ కోరికను ఉప్పల్ వేదికగా భువీ తీర్చేశాడు. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో భువనేశ్వర్ తన స్వింగ్ మ్యాజిక్ ని చూపించాడు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఇద్దరు డేంజరెస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.

ఫస్ట్ బాల్ ను జైస్వాల్ సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత రెండో బంతికి డేంజరెస్ బ్యాటర్ జోస్ బట్లర్ ను గోల్డెన్ డక్ చేసేశాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ వంతు వచ్చింది. 2, 3 బంతులను తెలివిగా డిఫెండ్ చేసుకున్నాడు. కాస్త పట్టు దొరికిన తర్వాత ఆడాలని ప్లాన్ చేసి ఉండచ్చు. కానీ, భువీ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓవర్లో నాలుగో బంతికి సంజూ శాంసన్ ను క్లీన్ బౌల్డ్ చేసేశాడు. నిజానికి భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని.. సంజూ శాంసన్ మాత్రమే కాదు.. మరే వరల్డ్ క్లాస్ బ్యాటర్ వచ్చినా కూడా ఆడగలడు అనే అవకాశం లేదు. ఆ బాల్ అంత అద్భుతంగా ఉంది. సంజూ కూడా సైలెంట్ గా పెవిలియన్ కు చేరాడు.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మాత్రం భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనకు ఫుల్ ఖుషీ అయిపోయారు. అలాగే ఈ మ్యాచ్ లో తెలుగోడు నితీశ్ రెడ్డి కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 42 బంతుల్లోనే 8 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో ఏకంగా 76 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి నాక్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భలే ఆదుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వింటేజ్ ప్రదర్శన చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.