Tirupathi Rao
Pat Cummins Trapped Faf Du Plessis: ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరులో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. వాటిలో కమిన్స్ ప్లాన్ చేసి ఫాఫ్ ని అవుట్ చేసింది కూడా ఒకటి.
Pat Cummins Trapped Faf Du Plessis: ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరులో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. వాటిలో కమిన్స్ ప్లాన్ చేసి ఫాఫ్ ని అవుట్ చేసింది కూడా ఒకటి.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఆ జట్టు మిగిలిన జట్లకు పెను గండంగా మారిపోయింది. 250+ రన్స్ కొడుతూ జోరు మీదున్న హైదరాబాద్ జట్టును కూడా ఆర్సీబీ వణికిస్తోంది. బ్యాటుతో దడదడలాడించిన బెంగళూరు.. బాల్ తో కూడా అదరగొట్టింది. ట్రావిస్ హెడ్(1), మార్కరమ్(7), అభిషేక్ శర్మ(31) హైదరాబాద్ టాపార్డర్ మొత్తాన్ని చాలా తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేర్చారు. ఈ మ్యాచ్ లో బెంగళూరు చాలా కసితో ఆడింది. అయితే బెంగళూరు మరింత ప్రమాదకరంగా మారి ఉండేది. కానీ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ కెప్టెన్ ను కమిన్స్ పక్క వ్యూహంతో అవుట్ చేశాడు. ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆర్సీబీ- హెదరాబాద్ మ్యాచ్ లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. వాటిలో కమిన్స్- ఫాఫ్ డుప్లెసిస్ మధ్య జరిగినది కూడా ఒకటి. అదేంటంటే.. కమిన్స్ పక్కా ప్లాన్ తో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ని అవుట్ చేశాడు. నిజానికి సిసలైన కెప్టెన్ అనిపించుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ లో డుప్లెసిస్ కాస్త ప్రమాదకరంగానే కనిపించాడు. కేవలం 12 బంతుల్లోనే 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేశాడు. కమిన్స్ గనుక పక్కా ప్లాన్ తో అవుట్ చేయకపోతే స్కోర్ కార్డు ఇంకా పరుగులు పెట్టేది. కమిన్స్ ఈ విషయంలో అసలు సిసలు అయిన మేటి కెప్టెన్ అనిపించుకున్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఫాఫ్ డుప్లెసిస్ కాస్త దూకుడుగానే ఆడుతున్నాడు. అలాంటి సమయంలో నటరాజన్ ఫాఫ్ కోసం ఫీల్డింగ్ మార్చాలి అనుకున్నాడు. లాంగ్ ఆన్ లో ఉన్న ప్యాట్ కమిన్స్ ని మిడ్ ఆన్ లోకి రామని సూచించాడు. కానీ, కెప్టెన్ కమిన్స్ మాత్రం లాంగ్ ఆన్ నుంచి వచ్చేందుకు నిరాకరించాడు. తాను లాంగ్ ఆన్ లోనే ఉంటాను అని స్పష్టం చేశాడు. ఇంకేముంది ఫాఫ్ డుప్లెసిస్ తనకోసం కమిన్స్ ఏదై పెద్దగా ప్లాన్ చేశాడు అనుకుని కాస్త కంగారు పడ్డాడు. ఆ కంగారులో నటరాజన్ వేసిన తర్వాతి బంతికే ఒక చెత్త షాట్ ఆడి మార్కరమ్ కు క్యాచ్ ఇచ్చేశాడు. ఇంకేముంది దిగాలుగా పెవిలియన్ కు చేరాడు.
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక కెప్టెన్ గా కమిన్స్ చాలా తెలివిగా ప్రవర్తించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆర్సీబీ కెప్టెన్ ని హెదరాబాద్ కెప్టెన్ తెలివితో కొట్టాడు. ఈ సీజన్లో జరిగిన మ్యాచులు ఒకెత్తు.. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ ఒకెత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఎంతో స్ట్రాంగ్ గా కనిపించింది. హైదరాబాద్ టాపార్డర్ ను వణికించారు. హేమాహేమీలుగా ఇప్పటి దాకా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్లను చాలా తక్కువ స్కోర్లకే అవుట్ చేశారు. మరి.. ఫాఫ్ కోసం కమిన్స్ వేసిన ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.