iDreamPost
android-app
ios-app

IPLలో ఫస్ట్ వికెట్.. ఇంత డ్రామా మరే బౌలర్ కి జరిగి ఉండదు. ఏమైందంటే?

SRH vs MI- Anshul kamboj Debut IPL Wicket: అన్షుల్ కంబోజ్ ఐపీఎల్లో ముంబై తరఫున డెబ్యూ చేశాడు . తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఎట్టకేలకు తన ఐపీఎల్ డెబ్యూ వికెట్ కూడా దక్కించుకున్నాడు.

SRH vs MI- Anshul kamboj Debut IPL Wicket: అన్షుల్ కంబోజ్ ఐపీఎల్లో ముంబై తరఫున డెబ్యూ చేశాడు . తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఎట్టకేలకు తన ఐపీఎల్ డెబ్యూ వికెట్ కూడా దక్కించుకున్నాడు.

IPLలో ఫస్ట్ వికెట్.. ఇంత డ్రామా మరే బౌలర్ కి జరిగి ఉండదు. ఏమైందంటే?

ఐపీఎల్లో కొత్త టాలెంట్ కి కొదవ ఉండదు. ప్రతి సీజన్లో కనీసం ఒక్కరన్నా యంగ్ ప్లేయర్ మెరుస్తూ ఉంటాడు. అలా ఈ సీజన్లో అన్షుల్ కంబోజ్ పేరు మారేలా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ముంబై ఇండియన్స్ తరఫున అన్షుల్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. హైదరాబాద్ జట్టును కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డట్లేదు కనిపించింది. కానీ, ముంబై జట్టు నిలదొక్కుకుంది. హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్ కి వరుస కట్టారు. ఐతే అన్షుల్ మాత్రం వికెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఐతే అన్షుల్ కి వికెట్ దక్కే క్రమంలో చాలానే డ్రామా జరిగింది. మరి ఆ డ్రామా ఏంటో చూద్దాం.

ముంబై మీద మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు కాస్త తడబడినట్లు కనిపించారు. మొదట్లో బాగానే బ్యాటింగ్ చేసినా వరుసగా వికెట్స్ కోల్పోయారు. మొదట అభిషేక్ శర్మ కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. మయాంక్ అగర్వాల్ కేవలం 5 పరుగులే చేశాడు . ట్రావిస్ హెడ్ కాస్త డేంజరస్ గా కనిపించాడు. కానీ, హెడ్ ని కూడా త్వరగానే అవుట్ చేసారు. అన్షుల్ కాంభోజ్ ఓవర్ లో ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐతే అది నో బాల కావడంతో హెడ్ కి మంచి లైఫ్ దొరికినట్లు అయ్యింది. అన్షుల్ మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అది అతనికి ఐపీఎల్లో డెబ్యూ వికెట్. ఆ తర్వాతి బాల్ కూడా ఆటను నో బాల్ గానే వేశాడు. అలాంటి సమయంలో కొత్త బౌలర్ ఎవరైనా సరే ఒత్తిడికి లోనవుతారు. కానీ, అన్షుల్ మాత్రం ఏంటో ఆత్మ విశ్వాసం ప్రదర్శించాడు.

మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేశాడు. ఆఖరికి అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది. అన్షుల్ తన డెబ్యూ వికెట్ సొంతం చేసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని తన డెబ్యూ వికెట్ ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అన్షుల్ కంబోజ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీసుకున్నాడు. డెబ్యూ అయినా కూడా ఏంటో బాగా బౌలింగ్ చేశాడంటూ దిగ్గజాలు కూడా ప్రసంశలు కురిపించారు. ఇంకా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో బాగానే తడబడింది. బ్యాటర్లను చుస్తే.. ట్రావిస్ హెడ్(48) పరుగులతో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. అభిషేక్ శర్మ(11), మయాంక్ అగర్వాల్(5), నితీశ్ రెడ్డి(20) క్లాస్సేన్(2) పరుగులు మాత్రమే చేయగలిగారు. ముంబై టీం మాత్రం బౌలింగ్ లో అద్భుతం చేసేసింది.