Nidhan
బ్యాటింగ్, బౌలింగ్‌తో అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టడం కామనే. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తోంది.
బ్యాటింగ్, బౌలింగ్‌తో అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టడం కామనే. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తోంది.
Nidhan
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టడం కామనే. కానీ సన్‌రైజర్స్ మాత్రం కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి లక్నో సూపర్ జియాంట్స్‌కు చెమటలు పట్టిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోను ఆరెంజ్ ఆర్మీ ఫీల్డర్లు దారుణంగా దెబ్బతీశారు. ఆ టీమ్ జోరుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేశారు. ఒకర్ని మించి మరొకరు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (2)తో పాటు పించ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్ (3)ను భువనేశ్వర్ కుమార్ వెనక్కి పంపాడు. అయితే ఈ ఇద్దరూ రెండు సూపర్ క్యాచ్‌ల వల్ల పెవిలియన్ చేరారు. డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర నితీష్ అద్భుతంగా అందుకున్నాడు. సూపర్ జంప్‌తో బాల్‌ను పట్టిన నితీష్.. బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాల్లోకి విసిరాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ దాటొచ్చి మరీ క్యాచ్ పట్టాడు. అనంతరం భువీ బౌలింగ్‌లో స్టొయినిస్ లెగ్ సైడ్ కొట్టిన బాల్‌ను సూపర్ మ్యాన్‌లా గాల్లో డైవ్ చేస్తూ అందుకున్నాడు సాన్వీర్ సింగ్. ముందు వైపు దూకుతూ నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టాడు. నితీష్, సాన్వీర్ ఫీల్డింగ్ ఎఫర్ట్ వల్ల 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్లకు 58 పరుగులే చేయగలిగింది.
SANVIR SINGH – WHAT A STUNNER. 😳👌 pic.twitter.com/T528LD7vLM
— Johns. (@CricCrazyJohns) May 8, 2024