iDreamPost
android-app
ios-app

SRH vs LSG: భువనేశ్వర్ సూపర్బ్ బౌలింగ్.. వాళ్లపై కోపాన్ని బ్యాటర్ల మీద చూపించాడు!

  • Published May 08, 2024 | 10:01 PM Updated Updated May 08, 2024 | 10:16 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు ప్రైమ్ ఫామ్​లో ఉన్నాడు. ఒకప్పటి భువీలా నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు ప్రైమ్ ఫామ్​లో ఉన్నాడు. ఒకప్పటి భువీలా నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

  • Published May 08, 2024 | 10:01 PMUpdated May 08, 2024 | 10:16 PM
SRH vs LSG: భువనేశ్వర్ సూపర్బ్ బౌలింగ్.. వాళ్లపై కోపాన్ని బ్యాటర్ల మీద చూపించాడు!

వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆ మధ్య ఫామ్​లేమితో చాలా ఇబ్బంది పడ్డాడు. గాయం కారణంగా భారత జట్టుకు చాన్నాళ్లు దూరమైన అతడు.. ఆ తర్వాత కోలుకొని కమ్​బ్యాక్ ఇచ్చినా మునుపటి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే భువీ మళ్లీ జోరందుకున్నాడు. ఈ ఐపీఎల్​ సీజన్​లో అతడు ప్రైమ్ ఫామ్​లో ఉన్నాడు. ఒకప్పటి భువీలా నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. లక్నో సూపర్ జియాంట్స్​తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లోనూ మ్యాజికల్ స్పెల్​తో మెరిశాడు భువీ. లక్నోతో మ్యాచ్​లో 4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.

అపోజిషన్ టీమ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (2)తో పాటు పించ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్ (3)ను భువీ వెనక్కి పంపాడు. వికెట్లు తీయడమే కాదు.. పరుగులు కూడా కట్టడి చేశాడు. నికోలస్ పూరన్ (48), ఆయుష్ బదోని (55) జోడీ ఆఖర్లో విధ్వంసం సృష్టించారు. కానీ భువీ బౌలింగ్​లో వీళ్ల పప్పులు ఉడకలేదు. 18వ ఓవర్ వేసిన ఎస్​ఆర్​హెచ్ పేసర్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కమిన్స్ కూడా భారీగా రన్స్ లీక్ చేశాడు. కానీ భువీ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పెల్ చూసిన నెటిజన్స్ వింటేజ్ భువీ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్​కు సెలెక్ట్ చేయలేదనే కసి, సెలెక్టర్ల మీద కోపంతోనే భువీ ఇంతలా బౌలింగ్​లో రెచ్చిపోతున్నాడని చెబుతున్నారు. మరి.. భువనేశ్వర్ స్పెల్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.