iDreamPost
android-app
ios-app

SRH vs KKR: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఏకంగా రోహిత్ శర్మ సరసన చోటు!

  • Published May 27, 2024 | 10:41 AM Updated Updated May 27, 2024 | 10:42 AM

ఐపీఎల్-2024లో కేకేఆర్​ను ఛాంపియన్​గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రోహిత్ శర్మ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

ఐపీఎల్-2024లో కేకేఆర్​ను ఛాంపియన్​గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రోహిత్ శర్మ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

  • Published May 27, 2024 | 10:41 AMUpdated May 27, 2024 | 10:42 AM
SRH vs KKR: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఏకంగా రోహిత్ శర్మ సరసన చోటు!

సంచలన ప్రదర్శనలతో ఫైనల్​కు దూసుకొచ్చిన సన్​రైజర్స్ హైదరాబాద్ ఈసారి కప్పు తమదేనని అభిమానులకు భరోసాను ఇచ్చింది. కోల్​కతా నైట్ రైడర్స్​ను చిత్తు చేసి టైటిల్ ఎగరేసుకోవడం పక్కా అని అంచనాలు పెంచేసింది. కానీ ఫైనల్ ఫైట్​లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్-2024 తుదిపోరులో కేకేఆర్ గెలిచింది. సన్​రైజర్స్​ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన అయ్యర్ సేన.. నయా ఛాంపియన్​గా అవతరించింది. మిచెల్ స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24), ఆండ్రీ రస్సెల్ (3/19) సూపర్బ్ బౌలింగ్​కు తలవంచిన ఆరెంజ్ ఆర్మీ.. 18.3 ఓవర్లలో 113 స్కోరుకే కుప్పకూలింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (24 పరుగులు) టాప్ స్కోరర్​గా నిలిచాడంటేనే మన టీమ్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వెంకీ అయ్యర్ (52 నాటౌట్), రెహ్మానుల్లా గుర్బాజ్ (39) చెలరేగి కేకేఆర్​ను విజయతీరాలకు చేర్చారు.

అద్భుతమైన బౌలింగ్​తో సన్​రైజర్స్ వెన్ను విరిచిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు. సీజన్ మొత్తం అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లో రఫ్ఫాడించిన స్పిన్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్​ విక్టరీతో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. పదేళ్ల తర్వాత టీమ్​కు కప్ అందించిన అయ్యర్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడంతో పాటు కెప్టెన్​గా ఐపీఎల్ కప్పును అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు అయ్యర్. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో రోహిత్ శర్మ తర్వాత ఈ ఫీట్​ను నమోదు చేసిన రెండో ప్లేయర్​గా నిలిచాడు కేకేఆర్ సారథి. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారాన్ని అందుకున్నాడు అయ్యర్.

Iyer

2015లో ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారాన్ని అందుకున్న అయ్యర్.. ఇప్పుడు కెప్టెన్​గా కేకేఆర్​ను ఛాంపియన్​గా నిలిపి అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ తర్వాత ఎమర్జింగ్ అవార్డు అందుకోవడంతో పాటు సారథిగా జట్టుకు కప్పు అందించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇక, ఐపీఎల్-2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున అద్భుతంగా ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు హిట్​మ్యాన్. ఆ తర్వాత ముంబై ఇండియన్స్​కు మారాడు. ఆ టీమ్ సారథ్య బాధ్యతలు చేపట్టి ఏకంగా 5 కప్పులు అందించాడు. ఈ సీజన్​కు ముందు ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్​ను తీసేసిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన ముంబై 14 మ్యాచుల్లో పదింటిలో ఓడి పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో నిలిచింది. మరి.. రోహిత్ సరసన అయ్యర్ చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.