Nidhan
టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో సన్‌రైజర్స్-కోల్‌కతా మ్యాచ్ ముగిశాక బీసీసీఐ సెక్రెటరీ జైషా గ్రౌండ్లోకి వచ్చాడు. కేకేఆర్ మెంటార్ గంభీర్‌తో సుదీర్ఘంగా సంభాషించాడు.
టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో సన్‌రైజర్స్-కోల్‌కతా మ్యాచ్ ముగిశాక బీసీసీఐ సెక్రెటరీ జైషా గ్రౌండ్లోకి వచ్చాడు. కేకేఆర్ మెంటార్ గంభీర్‌తో సుదీర్ఘంగా సంభాషించాడు.
Nidhan
ఐపీఎల్-2024 ముగిసింది. కొన్ని వారాలుగా క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన క్యాష్ రిచ్ లీగ్ నిన్నటితో పూర్తయింది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగిసింది. తుదిపోరులో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసి కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టు 10 ఏళ్ల తర్వాత కప్పు కలను నిజం చేసుకుంది. ఓవరాల్‌గా కోల్‌కతా మూడో కప్పును తమ ఖాతాలో వేసుకుంది. నిన్నటి మ్యాచ్‌కు సంబంధించిన చాలా విషయాలు వైరల్‌గా మారాయి. కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్, బీసీసీఐ సెక్రెటరీ జైషా సంభాషించుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడి కోసం బీసీసీఐ వెతకడం మొదలుపెట్టింది. హెడ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, కివీస్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ పదవికి అప్లై చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే వీళ్లు ముగ్గురూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఈ సమయంలో నిన్న కేకేఆర్-ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ముగిశాక గంభీర్‌ను జైషా కలవడం ఇంట్రెస్టింగ్గా మారింది. హెడ్ కోచ్ రేసులో మొదటి నుంచి గౌతీ పేరు వినిపిస్తుండటంతో వీళ్ల కలయిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. గంభీర్‌ను కలసిన షా చాలా సేపు అతడితో ముచ్చటించాడు.
మ్యాచ్ తర్వాత గంభీర్-షా నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. మాటలు ముగిసిన తర్వాత గౌతీని హగ్ చేసుకున్నాడు షా. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్.. హెడ్ కోచ్ పోస్ట్‌కు గంభీర్‌ను షా ఒప్పించినట్లే కనిపిస్తోందని అంటున్నారు. కోచ్‌గా గౌతీనే కావాలని పట్టుబట్టి దాన్ని సాధించాడని చెబుతున్నారు. గంభీర్ వస్తే టీమ్ రాత మారడం ఖాయమని, ఐసీసీ ట్రోఫీలు భారత్ ఖాతాలో చేరడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పదేళ్ల తర్వాత తమకు కప్పు అందించిన గౌతీని వచ్చే పదేళ్లు కూడా మెంటార్‌గానే ఉండమని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ రిక్వెస్ట్ చేశాడట. అందుకోసం బ్లాంక్ చెక్ కూడా ఇచ్చాడని చెబుతున్నారు. మరి.. గంభీర్ కోల్‌కతాతోనే ఉండిపోతాడా? లేదా భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తాడా? అనేది త్వరలో తేలిపోతుంది.
Jay Shah had a chat with Gautam Gambhir and later hugged GG. 👀🇮🇳 pic.twitter.com/hl13xem7LN
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024