iDreamPost

SRH vs KKR: నిన్న మ్యాచ్​లో అనూహ్య సంఘటన.. గంభీర్ కాళ్లు మొక్కిన రింకూ సింగ్!

  • Published May 27, 2024 | 2:00 PMUpdated May 27, 2024 | 2:00 PM

కోల్​కతా నైట్ రైడర్స్ అనుకున్నది సాధించింది. పదేళ్ల కప్పు కోరికను నిజం చేసుకుంది. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఓడించి ఛాంపియన్​గా అవతరించింది.

కోల్​కతా నైట్ రైడర్స్ అనుకున్నది సాధించింది. పదేళ్ల కప్పు కోరికను నిజం చేసుకుంది. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఓడించి ఛాంపియన్​గా అవతరించింది.

  • Published May 27, 2024 | 2:00 PMUpdated May 27, 2024 | 2:00 PM
SRH vs KKR: నిన్న మ్యాచ్​లో అనూహ్య సంఘటన.. గంభీర్ కాళ్లు మొక్కిన రింకూ సింగ్!

కోల్​కతా నైట్ రైడర్స్ అనుకున్నది సాధించింది. పదేళ్ల కప్పు కోరికను నిజం చేసుకుంది. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఓడించి ఛాంపియన్​గా నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి పోరులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయ్యర్ సేన. టాస్ నెగ్గి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ ఓవర్లన్నీ ఆడలేకపోయింది. టోర్నీ ఆసాంతం బ్యాటింగ్​ విధ్వంసంతో ప్రత్యర్థులను భయపెట్టిన ఎస్​ఆర్​హెచ్.. తీరా ఫైనల్​లో చేతులెత్తేసింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే పరిమితమైంది. ఈజీ టార్గెట్​ను ఆడుతూ పాడుతూ 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది కేకేఆర్. ఈ గెలుపుతో ఆ జట్టు ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. కొందరు ఆనందం పట్టలేక ఏడ్చేశారు. ఒకర్నొకరు కౌగిలించుకొని కేరింతల్లో తేలిపోయారు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టంప్స్​ పట్టుకొని సంబురాలు చేసుకున్నాడు. పేసర్ హర్షిత్ రాణా తన స్టైల్​లో ఫ్లయింగ్ కిస్​లు ఇస్తూ పోయాడు. ఆల్​రౌండర్ ఆండ్రీ రస్సెల్ డ్యాన్సులు చేశాడు. సీనియర్ ప్లేయర్ సునీల్ నరైన్, మెంటార్ గౌతం గంభీర్ కూడా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అందరి కంటే కూడా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ వెరైటీగా సంబురాలు చేసుకున్నాడు. తోటి ఆటగాళ్ల మీద నీళ్లు విసురుతూ, విజిల్స్ వేస్తూ, కప్పును హగ్ చేసుకొని ఆ తర్వాత ముద్దులు కూడా పెట్టాడు. ఆనందంలో కేరింతలు కొట్టాడు. అందరికంటే ఎక్కువ జోష్​లో కనిపించాడు రింకూ. ఇదే క్రమంలో గంభీర్​ కాళ్లు కూడా మొక్కాడతను.

సన్​రైజర్స్ సంధించిన లక్ష్యాన్ని కోల్​కతా చేరుకోగానే ఆ టీమ్ ఆటగాళ్లు గ్రౌండ్​లోకి పరిగెత్తుకుంటూ వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ తరుణంలో గంభీర్ కనిపించగానే అతడి కాళ్లకు దండం పెట్టాడు రింకూ. ఊహించని ఘటనకు షాకైన గౌతీ.. వద్దంటూ వారించాడు. ఆ తర్వాత గంభీర్​తో పాటు ఇతర ఆటగాళ్లను హగ్ చేసుకున్నాడు రింకూ. కప్పు అందుకునే సమయంలోనూ అతడు హల్​చల్ చేశాడు. అలాగే నితీష్ రాణాతో కలసి ఓ స్పెషల్ వీడియో చేశాడు. జోక్స్ వేస్తూ అందర్నీ నవ్వించాడు. కామెంటేటర్ సురేష్ రైనా కలసిన సమయంలోనూ ఇంగ్లీష్​ గురించి మాట్లాడుతూ నవ్వించాడు. మొత్తానికి నిన్న కేకేఆర్ విక్టరీ తర్వాత బాగా సందడి చేసి వైరల్​గా మారాడు రింకూ. ఇక, ఈ సీజన్​లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ తక్కువగా వచ్చింది. మొత్తంగా 15 మ్యాచుల్లో 168 పరుగులు మాత్రమే చేశాడు రింకూ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి