Nidhan
ఐపీఎల్-2024 ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో తుదిపోరు మొదలవనుంది. ఈ తరుణంలో బీసీసీఐని టార్గెట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇది చూసిన నెటిజన్స్ అంత మాట అనేశాడేంటని అంటున్నారు.
ఐపీఎల్-2024 ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో తుదిపోరు మొదలవనుంది. ఈ తరుణంలో బీసీసీఐని టార్గెట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇది చూసిన నెటిజన్స్ అంత మాట అనేశాడేంటని అంటున్నారు.
Nidhan
ఐపీఎల్-2024 ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌కు చేరుకుంది. సీజన్లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ పూర్తవనుంది. ఇన్నాళ్లూ హైవోల్టేజ్ మ్యాచ్‌లు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేసిన క్రికెట్ లవర్స్.. టైటిల్ ఫైట్ వాటన్నింటికీ మించిన రేంజ్లో ఉండాలని ఆశిస్తున్నారు. ఎవరు విజేతగా నిలిచినా ఇబ్బందేం లేదని, రెండు జట్లు కూడా ఎంతో అద్భుతంగా ఆడుతూ ఈ స్థాయికి వచ్చాయని అంటున్నారు. అటు కేకేఆర్, ఇటు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో ఉన్నాయి. ఈ తరుణంలో కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ బోర్డును టార్గెట్ చేసుకొని అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత తనకు వెన్ను నొప్పి తిరగబెట్టిందని అన్నాడు అయ్యర్. ఆ ఇంజ్యురీ కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. అయితే తనకు గాయమైందని చెప్పినా, నొప్పిని తట్టుకోలేకపోతున్నానని మొత్తుకున్నా ఎవరూ వినలేదంటూ బోర్డు మీద పరోక్షంగా విరుచుకుపడ్డాడు అయ్యర్. ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్ నుంచి వైట్ బాల్‌కు మారడం అంత ఈజీ కాదన్నాడు. టీ20లకు అలవాటు పడటం కొంచెం కష్టమేనని, అయితే ఈ సవాల్‌ను స్వీకరించానని, ఇప్పుడు పూర్తిగా అలవాటు పడ్డానని చెప్పాడు. అయ్యర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్ బోర్డును లక్ష్యంగా చేసుకొనే అతడు ఇలా మాట్లాడాడని అంటున్నారు.
ఆర్నెళ్ల కింద వరకు అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్నాడు అయ్యర్. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా అవతరించాడు. అలాంటోడు వన్డే వరల్డ్ కప్-2023కి ముందు గాయంతో ఇబ్బంది పడ్డాడు. అయినా మెగా టోర్నీలో ఆడాలనే ఉద్దేశంతో ఐపీఎల్-2023కి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రపంచ కప్‌లో అదరగొట్టాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లోనూ ఆడాడు. అయితే వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలో నుంచి ఎన్ఏసీకు వెళ్లిపోయాడు. అయితే రీహాబిలిటేషన్‌లో ఉన్న అయ్యర్ క్రమంగా కోలుకున్నాడు. ఆ తరుణంలో రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించింది. గాయం తిరగబెడుతుందనే భయంతో అతడు అందుకు నిరాకరించాడు. దీంతో తమ మాట వినలేదని బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు పైవ్యాఖ్యలు చేశాడు. గాయమైందని చెప్పినా ఎవరూ తన మాట వినలేదంటూ ఇన్‌డైరెక్ట్‌గా బోర్డుపై ఫైర్ అయ్యాడు.
Shreyas Iyer said, “I had back issues after the World Cup especially in the longer format, but nobody was agreeing. The switch from red-ball to white-ball at the start was a bit challenging, but it’s fine now”. pic.twitter.com/71SONOq6dL
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2024