Nidhan
సన్‌రైజర్స్ నయా స్టార్ నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరి వల్లా కానిది అతడు చేసి చూపించాడు.
సన్‌రైజర్స్ నయా స్టార్ నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరి వల్లా కానిది అతడు చేసి చూపించాడు.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఆణిముత్యం దొరికాడు. గత కొన్ని సీజన్లుగా నిరాశపరుస్తూ వస్తున్న జట్టుకు అతడు ఆపద్బాంధవుడు అయ్యాడు. ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు తెలుగుతేజం, విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. 20 ఏళ్ల ఈ యంగ్ ఆల్‌రౌండర్ తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు నితీష్. పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. అతడితో పాటు బౌలర్లు కూడా రాణించడంతో పంజాబ్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది ఆరెంజ్ ఆర్మీ. ఈ మ్యాచ్‌తో నితీష్ చరిత్ర సృష్టించాడు.
పంజాబ్‌పై మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ మెరిశాడు నితీష్ రెడ్డి. 3 ఓవర్లు వేసిన అతడు 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. 11 బంతుల్లో 19 పరుగులతో జోరు మీదున్న జితేష్ శర్మను ఔట్ చేసి మంచి బ్రేక్ త్రూ అందించాడు. తద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదడం, ఓ వికెట్ తీయడం, అలాగే క్యాచ్ కూడా అందుకున్న ఏకైక అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నితీష్ నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడతను. ఈ మ్యాచ్‌లో అతడు మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఫిఫ్టీ బాదిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు నితీష్. 20 ఏళ్ల 319 రోజుల వయసులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు.
ఐపీఎల్లో చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన వారిలో నితీష్ రెడ్డి కంటే ముందు ప్రియమ్ గార్గ్ ఉన్నాడు. అతడు 19 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ మైల్‌స్టోన్‌ను రీచ్ అయ్యాడు. టీమ్ విజయాల్లో కీలకంగా మారిన నితీష్‌ను అందరూ పొగుడుతున్నారు. ఎస్ఆర్హెచ్కు మరో ఆణిముత్యం దొరికాడని ప్రశంసిస్తున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో తన పెర్ఫార్మెన్స్ మీద ఈ యంగ్ ఆల్‌రౌండర్ రియాక్ట్ అయ్యాడు. ‘ఇది వ్యక్తిగతంగా నాతో పాటు నా జట్టుకు కూడా బిగ్ కాంట్రిబ్యూషన్. నిన్ను నువ్వు నమ్ముకో, ఏదైనా చేయగలవు అంటూ నాకు నేనే పదే పదే చెప్పుకున్నా’ అని నితీష్ తెలిపాడు. యంగ్ బ్యాటర్ పెర్ఫార్మెన్స్ మీద సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. నితీష్ అద్భుతమైన ఆటగాడని.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా సరే గ్రౌండ్లో అతడ్ని ఆపడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. మరి.. నితీష్ రెడ్డి అరుదైన ఘనత మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.